Etela Rajender: ఉప్పల్ చౌరస్తా నుంచి పీర్జాదిగూడ మీదుగా రింగ్ రోడ్డు వరకు ప్రయాణించాలంటే ప్రజలు నరకం చూస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) వ్యాఖ్యానించారు. ఉప్పల్-వరంగల్ హైవే రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే(National Highway) అథారిటీ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.వందల కోట్లు మంజూరు చేస్తే కాంట్రాక్టర్ దివాళా తీసి సతాయిస్తున్నాడని ఫైరయ్యారు.
Also Read: Madhira Railway Station : మధిర రైల్వే స్టేషన్ బదిలీపై ఆందోళన.. ఖమ్మం ఎంపీకి వినతి\
వర్షం పడితే రోడ్లు చెరువుల్లాగా మారిపోతున్నాయి
కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య వల్ల, బీటీ రోడ్ ఫార్మేషన్ కాకపోవడం వల్ల, బిల్డింగులకు కాంపెన్సేషన్ రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. బైక్‌పై వెళ్లే వారికి నడుములు పోతున్నాయని ఈటల పేర్కొన్నారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోందని, వర్షం పడితే రోడ్లు చెరువుల్లాగా మారిపోతున్నాయన్నారు. రోడ్డు వేయకపోవడం వల్ల షాపుల్లో మట్టి పేరుకు పోతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పరిస్థితిని వివరిస్తే ఫ్లైఓవర్‌కు ఇరువైపులా రోడ్డు నిర్మాణానికి డబ్బులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఈటల వెల్లడించారు.
Also Read: MP Raghunandan Rao: 71 వేల ఫేక్ ఓట్లు.. బీహార్ ఓటమిని ముందే ఒప్పుకున్నారు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు