Bathukamma 2025: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల ఉత్సవాలకు వర్షం భయం పట్టుకుంది. ఈ సారైనా ఎల్బీ స్టేడియం వేదికగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా పది వేల మందితో సామూహిక బతుకమ్మ (Bathukamma)ఉత్సవాన్ని నిర్వహించాలన్న బల్దియా సంకల్పానికి వర్షం అడ్డంకిగా మారింది. దీంతో బతుకమ్మ ఉత్సవాలు (Bathukamma 2025) నిర్వహించనున్న కల్చరల్, టూరిజంతో పాటు జీహెచ్ఎంసీకి ఉత్సవాల నిర్వహణ టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో సామూహిక బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై జీహెచ్ఎంసీ పునారాలోచనలో పడింది.
Also Read: Jogulamba Temple: జోగులాంబ ఆలయ మిస్టరీ.. అమ్మవారిని నేరుగా ఎందుకు దర్శించుకోరో తెలుసా?
గిన్నీస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు
ఇప్పటికే ఈ సారి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు భారీగా ప్రచారం చేసుకున్న నేపథ్యంలో గిన్నీస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలను ఎలా నిర్వహించాలన్న విషయంపై జీహెచ్ఎంసీ, సాంస్కృతిక, పర్యాటక శాఖలు అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. అంతేగాక, ఈ నెల 28వ తేదీన సాయంత్రం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించాలనుకున్న సామూహిక బతుకమ్మ తేదీని 26 కు మార్చుకోవటంతో పాటు పది వేల మందితో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు వేదికగా ఎల్బీ స్టేడియం కు బదులుగా సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం.
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా సామూహిక బతుకమ్మను నిర్వహించనున్నట్లు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసుకుని, ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలన్న వాదనలుండగా, సరూర్ నగర్ లో వాటర్ ప్రూఫ్ టెంట్ వేసుకుని నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎల్బీ స్టేడియంలోనే రెండు అడుగుల ఎత్తువరకు వుడ్ స్టేజీని ఏర్పాటు చేసి, పైనా వాటర్ ప్రూఫ్ టెంట్ ను ఏర్పాటు చేసి సామూహిక బతుకమ్మను నిర్వహించాలని మరి కొందరు అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ముందుగా ప్రకటించిన సామూహిక బతుకమ్మ ఉత్సవాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలన్న ఆలోచనలో అధికారులున్నట్లు సమాచారం.
తుది నిర్ణయం వారిదే
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా నిర్వహించాలనుకున్న సామూహిక బతుకమ్మ ఉత్సవాలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలా? లేక సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించాలా? అన్న విషయంలో తది నిర్ణయం స్టేట్ కల్చరల్, టూరిజం శాఖ అధికారులదే తుది నిర్ణయమని సమాచారం. సామూహిక బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి జీహెచ్ఎంసీ పాత్ర కేవలం ఎనిమిది వేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలను స్టేడియంకు తరలించటం, తిరిగి వారిని తమతమ గమ్యస్థానాలకు చేర్చటం వరకే జీహెచ్ఎంసీకి బాధ్యతలను కేటాయించటంతో వర్ష సూచన ఉన్నా, సామూహిక బతుకమ్మ నిర్వహణపై తుది నిర్ణయం సర్కరు, స్టేట్ కల్చరల్, టూరిజం శాఖదేనన్న వాదనలున్నాయి. అసలు ఉత్సవాలు నిర్వహించాలా? లేదా? రెయిన్ అలర్ట్స్ ప్రకారం బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలా? లేదా? ఒక వేళ నిర్వహించి ఏకంగా పది వేల మంది స్వయం సహాయక బృందాల మహిళలను ఇబ్బందలు పాలు చేయటం ఎంత వరకు సమంజసమని కూడా అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం
రేపటి బతుకమ్మ కుంట సంబరాలు వాయిదా
దశాబ్దాల క్రితం బతుకమ్మ ఆటా పాటాకు ల్యాండ్ మార్క్ గా ఉన్న బతుకమ్మ కుంటను గుర్తించి, పునరుద్దరించిన హైడ్రా ఈ నెల 25న సాయంత్రం సీఎం చేతుల మీదుగా సుమారు రెండున్నర వేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలతో కుంటలో నిర్వహించతలపెట్టిన బతుకమ్మ ఉత్సవాలను కూడా సర్కారు వాయిదా వేసినట్లు సమాచారం. గురువారం నాటి ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రానికి వాయిదా వేసినట్లు తెలిసింది.
Also Read: OTT Movie: ఎవరూలేని టీనేజ్ అమ్మాయి జీవితంలో జరిగిన షాకింగ్ ఘటన ఏంటంటే?