OTT Movie: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న “ది రాంగ్ పారిస్” ఒక లైట్‌హార్టెడ్ రొమాంటిక్ కామెడీ. ఇది ప్రేక్షకులను ఫ్రాన్స్‌లోని పారిస్ కలల నుంచి టెక్సాస్‌లోని పారిస్ వరకు తీసుకెళ్తుంది. జేనీన్ డేమియన్ దర్శకత్వంలో, నికోల్ హెన్రిచ్ రచనలో, మిరాండా కాస్‌గ్రోవ్ నటనతో ఈ సినిమా రియాలిటీ షో ఫార్మాట్‌ను సరదాగా ఉపయోగించుకుంటూ, హాస్యం, రొమాన్స్‌తో మెప్పిస్తుంది.
Read also-Anil Ravipudi: ‘భూతం ప్రేతం’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?
కథ
సినిమా కథ డాన్ (మిరాండా కాస్‌గ్రోవ్) చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక చిన్న టెక్సాస్ పట్టణంలో వెయిట్రెస్‌గా, మెటల్ స్కల్ప్చర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ, ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఆర్ట్ స్కూల్‌లో చేరాలని కలలు కంటుంది. కానీ, ఆర్థిక ఇబ్బందులు, పెద్దమ్మను చూసుకోవాల్సిన బాధ్యతలు ఆమె కలలకు అడ్డంకులు. ఇంతలో, ఒక రియాలిటీ డేటింగ్ షోలో చాన్స్ వస్తుంది, అది “పారిస్”లో జరుగుతుందని భావించి డాన్ జాయిన్ అవుతుంది. కానీ, షాక్ ఏమిటంటే, అది ఫ్రాన్స్ కాదు, టెక్సాస్‌లోని పారిస్!షోలో ట్రే (పియర్సన్ ఫోడ్), ఒక ఆకర్షణీయ రాంచర్, బ్యాచెలర్‌గా కనిపిస్తాడు. డాన్, ట్రేతో షో మొదలయ్యే ముందు ఒక బార్‌లో సరదాగా మాట్లాడుతుంది. ఆ బంధం తర్వాత షోలో కొనసాగుతుంది. ఇతర కంటెస్టెంట్స్‌లో లెక్సీ (మ్యాడిసన్ పెట్టిస్), జాస్మిన్ (క్రిస్టిన్ పార్క్) ఉంటారు. షో ప్రొడ్యూసర్ (యవోన్ ఓర్జీ) కామెడీ, డ్రామాను జోడిస్తూ, డాన్‌ను షో రూల్స్ బ్రేక్ చేయమని ప్రోత్సహిస్తుంది. డాన్ తన కలలు, ప్రేమ మధ్య ఎలా బ్యాలెన్స్ చేస్తుందన్నది కథలోని ఆసక్తికర అంశం.
హైలైట్స్
ఫన్, ఫీల్-గుడ్, ఫ్రెష్మిరాండా కాస్‌గ్రోవ్ డాన్‌గా అద్భుతంగా నటించింది. ఆమె సహజమైన నటన, ఎమోషనల్ డెప్త్ సినిమాకు బలం. ట్రే పాత్రలో పియర్సన్ ఫోడ్‌తో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. రియాలిటీ షో సాటైర్ – ముఖ్యంగా ఫన్నీ చాలెంజెస్, కంటెస్టెంట్ డ్రామా – సినిమాకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. టెక్సాస్ లొకేషన్స్, రాంచ్ వైబ్స్, గ్రీన్ స్క్రీన్‌తో సృష్టించిన “పారిస్” సీన్స్ విజువల్‌గా ఆహ్లాదకరం. సినిమా రన్‌టైమ్ (1 గంట 45 నిమిషాలు) స్పీడీగా, ఎంగేజింగ్‌గా ఉంది.
Read also-Ghaati OTT: స్వీటీ ‘ఘాటి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకొన్ని గంటల్లోనే!
లోపాలు
కథ మొత్తం ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. రియాలిటీ షో సాటైర్ మరింత డీప్‌గా ఉండొచ్చు. కొన్ని జెండర్ స్టీరియోటైప్స్, ఓవర్-ది-టాప్ రొమాంటిక్ సీన్స్ కొంచెం చీజీగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తిగా సరిపోకపోవచ్చు.
రేటింగ్- 3.5/5