Anil Ravipudi: చిన్న సినిమాలకు సపోర్ట్ అందించడంలో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముందుంటారనే విషయం తెలియంది కాదు. మరోసారి ఆయన ఓ చిన్న సినిమాకు సపోర్ట్ అందించారు. సృజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి. వెంకటేశ్వర రావు నిర్మిస్తోన్న చిత్రం ‘భూతం ప్రేతం’ (Bhootham Praytham). రాజేష్ ధృవ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌లో యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read- OG Movie: ‘మిరాయ్’ మాత్రమే కాదు.. ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లు కూడా.. బన్నీ వాసు సంచలన ప్రకటన
టైటిల్, ఫస్ట్ లుక్ బాగున్నాయ్..
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘భూతం ప్రేతం’ ఫస్ట్ లుక్ (Bhootham Praytham First Look) విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. యాదమ్మ రాజు, భాస్కర్ నా టీమ్. వారి కోసం నేను ఇలా సపోర్ట్ చేస్తున్నాను. సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుంది. సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఈ సినిమాకు పని చేసిన వారందరికీ మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇదొక హారర్, కామెడీ చిత్రమని ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ ఫస్ట్‌లుక్‌లో ఓ ఐదుగురు కుర్రాళ్లు.. భూతానికి, ప్రేతానికి చిక్కినట్టుగా కనిపిస్తున్నారు. ఆ భూతం నుంచి ఈ కుర్రాళ్లు ఎలా బయటపడ్డారు? అనే కథతో.. హాయిగా నవ్వుకునేలా, అలాగే భయపెట్టేలా ఈ సినిమాను మలిచారనేది ఈ ఫస్ట్ లుక్ తెలియజేస్తుంది. ఈ ఏడాదిలోనే ‘భూతం ప్రేతం’ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌తో మేకర్లు ఆడియెన్స్ ముందుకు రానున్నామని తెలిపారు.
Also Read- OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?
మెగాస్టార్‌తో మూవీ..
వరుస సక్సెస్‌లతో దూసుకెళుతోన్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana ShankaraVaraprasad Garu) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారు. చిరంజీవిని వింటేజ్ అవతార్‌లో చూపిస్తూ, అభిమానులకు కనువిందు ఇచ్చేలా అనిల్ ప్లాన్ చేసినట్లుగా.. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తెలియజేస్తుంది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు