OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా.. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఓజీ’ విడుదలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న అధికారికంగా విడుదల కాబోతోంది. అంతకంటే ముందే అంటే, సెప్టెంబర్ 24 రాత్రికే ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రీమియర్ షోలకు సంబంధించి కొంతమేర కన్ఫ్యూజన్ నెలకొన్నప్పటికీ, ఆ టైమ్‌కి అన్ని క్లియర్ అవుతాయని అభిమానులు, సినిమా సెలబ్రిటీలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదల వేళ, పవన్ కళ్యాణ్ అభిమానులు డ్యూటీ ఎక్కేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు సరిపడా టైమ్ లేకపోవడంతో, నిర్మాత కూడా చేతులెత్తేశారు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని వారే చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆ సంచలన నిర్ణయం ఏమిటంటే..
Also Read- Ghaati OTT: స్వీటీ ‘ఘాటి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకొన్ని గంటల్లోనే!
‘మిరాయ్’ థియేటర్లలో ‘ఓజీ’
ఇటీవల థియేటర్లలోకి వచ్చి సంచలన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ‘మిరాయ్’ (Mirai) చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మిరాయ్’ సినిమా ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్న సమయంలో.. సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు ప్రదర్శించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం ఆయన అధికారికంగా ప్రకటించారు. మళ్లీ సెప్టెంబర్ 26న ‘మిరాయ్’ సినిమాను నార్మల్‌గానే ప్రదర్శించనున్నారు. సినిమా రిలీజ్ రోజు మాత్రం ‘ఓజీ’కి సరిపడా థియేటర్లను ‘మిరాయ్’ యూనిట్ త్యాగం చేయనుంది. ఈ నిర్ణయంతో, పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత అభిమానమో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిరూపించుకున్నారు. ఆయనను అభిమానులు పొగడ్తలతో కొనియాడుతున్నారు.
Also Read- OTT Movie: ఈ సీరియల్ కిల్లర్‌కు దొరికితే అంతే.. భయపడితే మాత్రం చూడకండి
‘ఓజీ’ ప్రీమియర్స్‌కు ‘లిటిల్‌హార్ట్స్’ థియేటర్స్
ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దారిలోనే ‘లిటిల్‌హార్ట్స్’ (Little Hearts) డిస్ట్రిబ్యూటర్ అయిన బన్నీ వాసు కూడా పయనమమ్యారు. ‘మిరాయ్’ కంటే ముందు రిలీజై, ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ‘లిటిల్‌హార్ట్స్’ చిత్రాన్ని బన్నీ వాసు (Bunny Vas) డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే. ‘ఓజీ’ మూవీ ప్రీమియర్ షోల కోసం ‘లిటిల్‌హార్ట్స్’ థియేటర్లు ఇచ్చి సహకరించాలని డిస్ట్రిబ్యూటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. అందరూ సహకరించి, ‘ఓజీ’ మూవీ ప్రీమియర్‌లకు గరిష్ట స్థాయిలో మద్దతు ఇవ్వాలని, పవర్ స్టార్ వైభవాన్ని పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అంతే, ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు డ్యూటీ ఎక్కేశారు అంటూ, టీజీ విశ్వప్రసాద్, బన్నీ వాసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కరెక్ట్ సమయంలో, అంతా ఇలా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ‘ఓజీ’ నామస్మరణే నడుస్తోంది. ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని మేకర్స్, ఫ్యాన్స్ భావిస్తున్నారు.
So far, we have cooperated for #OG. Now, for the premiere shows of #TheyCallHimOG across all #LittleHearts theatres…
This is a request to our #LittleHearts distributors.. please cooperate and ensure maximum support for the OG premieres.
Let’s celebrate our Powerstar…
— Bunny Vas (@TheBunnyVas) September 24, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు