Ghaati OTT: క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty), క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం ‘ఘాటి’ (Ghaati). విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించింది. షీలావతిగా అనుష్క విశ్వరూపం ప్రదర్శించిన ఈ సినిమా థియేటర్లలో అంతగా సక్సెస్ సాధించనప్పటికీ.. ఓటీటీలో మాత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణను రాబట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ఉన్న ప్రైమ్ సభ్యుల ముందుకు ‘ఘాటి’ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు వస్తోంది.
Also Read- Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?
స్ట్రీమింగ్ డేట్ ఇదే.. (Ghaati OTT Streaming Date)
‘ఘాటి’ స్ట్రీమింగ్ డేట్‌కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ డేట్ ప్రకారం ఇంకొన్ని గంటల్లోనే ఈ సినిమా ఓటీటీ వీక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ ప్రైమ్ తెలిసిన ప్రకారం 26 సెప్టెంబర్, 2025 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో షీలావతి పాత్రలో అనుష్క ప్రదర్శించిన అభినయానికి ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్ర విజయ్ పాత్రలకు సైతం మంచి గుర్తింపు లభించింది. అణిచివేత నుంచి ప్రతీకారం వైపు నడిచే అనుష్క ప్రయాణాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. సాగర్ నాగవెల్లి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరి థియేటర్లలో అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 26 వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read- OG release hurdles: విడుదలకు ముందు ‘ఓజీ’పై జరుగుతున్న ఆ కుట్రలు నిజమేనా?.. ఎందుకంటే?
‘ఘాటి’ స్టోరీ ఇదే.. (Ghaati Story)
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కఠినమైన తూర్పు కనుమలలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ‘ఘాటిస్’ అనే అణగారిన వర్గానికి చెందిన ప్రజల జీవితాలను చూపిస్తుంది. ఈ ప్రజలు క్రూరమైన నాయుడు సోదరులచే నిర్వహించబడే అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో బలవంతంగా పని చేస్తుంటారు. తమ ప్రజలను ఈ దోపిడీ నుంచి విముక్తి చేయాలని షీలావతి (అనుష్క), దేశీ రాజు (విక్రమ్ ప్రభు) కలలు కంటారు. వారి పోరాటం నాయుడు బ్రదర్స్ (చైతన్య రావు, రవీంద్ర విజయ్) నేతృత్వంలోని క్రూరమైన సిండికేట్‌తో వారిని తలపడేలా చేస్తుంది. ఈ క్రమంలో షీలావతికి జరిగిన అన్యాయం ఏమిటి? నాయుడు బ్రదర్స్‌తో ఆమె ఎలా యుద్ధం చేసింది? చివరికి ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘ఘాటి’.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు