Medchal Municipality: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఉన్న రాఘవేంద్రనగర్(Raghavendranagar) అభివృద్ధికి దూరంగా ఉంది. మున్సిపాలిటీకి గణనీయంగా రాఘవేంద్రనగర్ పన్నుల రూపేణా ఆదాయం సమకూరుతున్నప్పటికీ అధికారులు కాలనీ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు రాఘవేంద్రనగర్ కాలనీలోనే శాంతా బయోటెక్(Santa Biotech), విద్యా సంస్థలు, భారీగా నివాస అపార్ట్మెంట్లు, గృహాలతో పాటు వాణిజ్య సంస్థలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి ఏటా రూ లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. పన్నులను నిక్కచ్చిగా వసూలు చేస్తున్న మున్సిపాలిటీ అదికారులు కాలనీలో నెలకొన్న సమస్యలపై పట్టించుకోవడం లేదు.
మౌలిక సదపాయాల లేమి
రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న రాఘవేంద్రనగర్ కాలనీలో నివాస గృహాలతో పాటు వాణిజ్య సంస్థలు పెరుగుతున్నాయి. కానీ మౌలిక సదుపాయలను కల్పించడం లేదు. రోడ్లు(Roads), డ్రైనేజీ(Drainage), నీరు, వీధి దీపాలు తదితర సౌకర్యాలకు నోచుకోవడం లేదు కాలనీలో పలు వీధుల్లో సీసీ రోడ్లు(CC Roads) లేకపోవడంతో మట్టి రోడ్లు చిన్నపాటి వర్షానికే చిత్తడి మయంగా మారి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో రోడ్డపై నుంచి వెళ్లే విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నీటి సరఫ రా కూడా సరిగా జరగడం లేదు. పలు వీధులకు వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి పూట ఇబ్బంది పడాల్సి వస్తుంది. మహిళలు, చిన్నారులకు రాత్రి వేళల్లో బయటకు రావడానికి జంకుతున్నారు ఒక్క శాంతా బయోటెక్ కంపెనీ నుంచే దాదాపు రూ.25 లక్షలు వరకు పన్ను రూపేణా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. అలాగే విద్యా సంస్థల నుంచి రూ లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. వాణిజ్య సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఇంత ఆదాయం ఉన్నా అధికారులు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం లేదన్న సమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారులు తమ కాలనీలో రోడ్లు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..
ఆధ్వాన్నంగా రోడ్లు
రాఘవేంద్రనగర్లోని పలు కాలనీల్లో రోడ్లు అధ్యానంగా ఉన్నాయి. సీసీ రోడ్లు(CC Roads) లేని కారణంగా మట్టిరోడ్లపై నుంచి వెళ్లడం ఇబ్బందిగా మారింది విన్నపాటి వర్షానికే రోడ్లు బురదమాయంగా మారుతున్నాయి వాహనదారులతో పాటు పాదాచారులు కూడా ఇక్కట్లు తప్పడం లేదు కాలనీ నుంచి మున్సిపాలిటీకి ప్రతి ఏటా క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నాం. అయినా సీసీ రోడ్డు వేయడం లేదు. అధికారులు స్పందించి రోడ్లతో పాటు మౌలిక సదుపాయలు కల్పించాలి.
Also Read: Seethakka: మహిళా సంక్షేమంపై నెదర్లాండ్‌లో అధ్యయనం.. విదేశీ పర్యటనలో మంత్రి సీతక్క
విధీ దీపాలు లేక ఇబ్బందులు
రాఘవేంద్రగన్ కాలనీలోని పలు విధుల్లో వీధి దీపాలు లేక ఇబ్బంది పడుతున్నాం రాత్రి పూట ఇండ్ల నుంచి బయటికి రావడానికి, బయటి నుంచి ఇంటికి రావడానికి భయపడాల్సి వస్తుంది. చిన్న పిల్లలు, మహిళలు తోడు లేకుండా గడపదాటలేని పరిస్థితి ఏర్పడింది. అదికారులు స్పందించి రాఘవేంద్రనగర్ కాలనీలోని వీధికి పలు వీధి దీపాలను ఏర్పాటు చేయాలి.
నీళ్లు రావడం లేదు
రాఘవేంద్ర నగర్ కాలనీ నీళ్ల(Water) సరఫరా సరిగా జరగడం లేదు. నాలంగైడు రోజులకు ఒకసారి కూడా నల్లా నీళ్లు రావడం లేదు. ఈ విషయంపై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశాం అయినా అధికారులకు గాని, నేతలు గానీ తమ కాలనీ గురించి పట్టించుకోవడం లేదు.
కమిషనర్ మేడ్చల్ మున్సిపాలిటీ
మేడ్చల్(Medchal) మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాము. ఆ నిధులు విడుదల అయితే రాఘవేంద్ర నగర్ కాలనీలో సిసి రోడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరిస్తాం మని కమీషనర్ చంద్ర ప్రకాష్ అన్నారు.
