హైదరాబాద్: Fake Mineral Water: మినరల్ వాటరే తాగండి పరవాలేదు ఇదీ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా గ్లాసుతో నీళ్లిచ్చి ముందుగా చెప్పే మాట చాలామంది దృష్టిలో బయట నుంచి కొని టిన్నులతో తెచ్చుకుంటే మినరల్ వాటర్ కింద లెక్క ఆ నీరు ఎంత వరకూ సురక్షితమంటే కాస్త ఆలోచించాల్సిందే మరి ప్లాంట్ నీళ్లు తెచ్చుకున్నంత మాత్రాన సురక్షితం కాదు సుమా ఏదో మినరల్ వాటర్ తాగుతున్నామని పైకి చెప్పుకోవడం తప్ప బోరు వాటర్ కంటే అధ్వానమైనవి మరి ఒకసారి మీరు మంచినీళ్లు తెచ్చుకునే ప్లాంట్‌కు అని అనుమతులు ఉన్నాయో! లేదో? చూస్కోండి లేదంటే మీ ఆరోగ్యం గోవిందా!? మినరల్ వాటర్ అనుకుంటూ లీటరు రూ.20 పెట్టికొంటున్నాం.
మినరల్స్ మాట దేవుడెరుగు అసలు అవి సురక్షిత తాగునీరేనా? అంటే ఆలో చించాల్సిందే. కలుషిత నీటి వల్ల వివిధ రోగాల బారిన పడే ప్రమాదం ఉన్నా యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. దీంతో వాటర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరైన పర్యవేక్షణ నియంత్రణ లేక మామూలు నీటిని నింపేసి నీళ్లలా డబ్బును దోచేస్తున్నారు. ప్యాకెజ్డ్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ రంగం ప్రస్తుతం వేల కోట్ల రూపాయల వ్యాపారమైపోయింది.
వేసవిలో నీటి వాడకంపై వాటర్ ప్లాంట్లపై ‘స్వేచ్ఛ’ కథనం
నిబంధనలకు పాత రేస్తూ నిబంధనలకు పాతరేస్తూ ప్రజా ఆరోగ్యాన్ని పనంగా పెడుతూ ధనర్జానే ద్యేయంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు. నాగారం, దమ్మయిగూడ రెండు మున్సిపాలిటీలలో పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్లు అడ్డగోలుగా వెలుస్తున్నాయి.సుమారు 500 పైగా వాటర్ ప్లాంట్ ఉండడం గమనార్హం.అధికారుల నియంత్రణ లేకపోవడం కొందరు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు వరంగా మారింది.
దీంతో నిబంధనలను నీళ్లలో కలిపేసి డబ్బులు దండుకుంటున్నారు.అసలు మినరల్ వాటర్ అంటే పూర్తిగా సురక్షితమని అర్థం. కాని అవేమి పాటించని కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా నీళ్లను నామమాత్రంగా శుద్ధి చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలను పాటించాల్సిన నిర్వాహకులు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో మాత్రం ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్లాంట్ల నుంచి విక్రయాలు జరుపుతూ జోరుగా డబ్బులు దండుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటర్ ప్లాంట్లు చాలావరకు ఎలాంటి అనుమతులు లేకుండానే కొనసాగుతుండడం గమనార్హం.
దీన్నిబట్టి చూస్తే వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారుల కళ్ళు కప్పుతున్న కొందరు నిర్వాహకులు కమర్షియల్ విద్యుత్ కు బదులుగా రెసిడెన్షియల్ కలెక్షన్లను వాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పరిశుభ్రతను పాటించని వ్యాపారులు ఎలాంటి శుభ్రత లేకుండానే అపరిశుభ్రత వాతావరణంలో నీళ్లను క్యాన్లలో పట్టి ప్రజలకు అంటగడుతున్నారు. ఒక్క బాటిల్ కు రూ.15 నుంచి రూ.20 రూపాయలు దండుకుంటున్నారు. ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలంటే స్థానిక అధికారుల అనుమతులతో పాటు ఐఎస్ఓ ప్రమాణాలతో అనుమతులు ఉండాలి.
కానీ దమ్మయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వాటర్ ప్లాంట్లు ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారాలు జరుపుతున్నారు. శంఖంలో పోసిందల్లా తీర్థం అన్నట్లుగా బాబుల్ లో పోసిన నీరును మినరల్ వాటర్ పేరుతో నడిపిస్తున్న అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.
అక్రమ నీళ్ల దందా ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుమతులు లేకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమా డుతున్న వాటర్ ప్లాంట్లకు అడ్డుకట్ట వేసి నీళ్ల దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
Also Read: Pink Moon 2025: మరికాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం.. చూడకుంటే బాధపడాల్సిందే!