Pink Moon 2025: ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఎప్పుడు దగ దగ మెరుస్తూ తెల్లగా కనిపించే చంద్రుడు.. ఇవాళ కొత్త రంగను సంతరించుకోనున్నాడు. సాధారణ రోజుల కంటే భిన్నంగా అందరి దృష్టిని ఆకర్షించనున్నాడు. చంద్రుడ్ని ఇప్పటివరకూ రెడ్, ఎల్లో, బ్లాక్ రంగుల్లో చూసి ఉంటారు. ఇవాళ రాత్రి అత్యంత అందంగా పింక్ కలర్ లో చూస్తారని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
పింక్ మూన్ అంటే ఏంటి?
ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే మెుదటి పౌర్ణమిని.. మైక్రో మూన్ (Micro Moon)గా పిలుస్తుంటారు. ఇది వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనికి గుర్తుగా ఏడాదిలో వచ్చే తొలి పౌర్ణమిని పింక్ మూన్ (Pink Moon)గా పిలుస్తుంటారు. వసంతకాలంలో వికసించే పువ్వు అని అర్థం వచ్చేలా పింక్ మూన్ అనే పేరు పెట్టారు. ఈ రోజున సాధారణ రోజుల్లో కంటే చంద్రుడు చాలా చిన్నగా కనిపిస్తాడు. దీనిని ఖగోళ భాషలో అపోజీ (Apogee) అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో ఒక్కో దేశంలో అవి ఉన్న అక్షాంశ, రేఖాంశ స్థానల దృష్ట్యా చంద్రుడు విభిన్నంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: Kamalapuram Students Failed: ఏమైందిరా.. మెుత్తం ఇలా కట్టకట్టుకొని ఫెయిల్ అయ్యారు..!
నిజంగానే పింక్ లో కనిపిస్తాడా?
అయితే నిజానికి చంద్రుడు పింక్ కలర్ లో కనిపిస్తాడా అంటే కచ్చితంగా చెప్పలేము. వసంత కాలంలో వచ్చే తొలి పౌర్ణమి కావడంతో సహజంగా పింక్ మూన్ అని పేరు వచ్చింది. అయితే సాధారణ రోజుల్లో కంటే చంద్రుడు కాస్త చిన్నగా.. కొత్త తరహా రంగులో మాత్రం కనిపిస్తాడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. కాలమానాల్లో వ్యత్యాసాల దృష్ట్యా.. తొలిగా అమెరికాలో ఈ పింక్ మూన్ ను చూడవచ్చు. ఇక భారత కాలమానం ప్రకారం ఆదివారం రోజున ఈ పింక్ మూన్ ను వీక్షించవచ్చు. అయితే ఇందుకోసం తెల్లవారు జామునే నిద్ర లేవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 13 ఉదయం 5 గం.ల ప్రాంతంలో ఆకాశంలో ఈ పింక్ మూన్ ను దర్శనమిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.