Pastor Praveen's death (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Pastor Praveen’s death: పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త షాకింగ్ నిజాలు.. క్లియర్ కట్ గా చెప్పేశారుగా!

Pastor Praveen’s death: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) అనుమానస్పద మృతి కేసు.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోలేదని అతడిది ముమ్మాటికే హత్యేనని క్రైస్తవ సంఘాలు, ఆయన అనుచర వర్గం తీవ్ర స్థాయిలో నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై ప్రతిపక్ష నేతలు వైఎస్. జగన్, షర్మిల సైతం రియాక్ట్ కావడంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ప్రవీణ్ మృతి కేసును చాలా నిశితంగా పరిశోధించారు. ఈ క్రమంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడించారు.

వైన్ షాప్స్ కు వెళ్లింది నిజమే
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ (IG Ashok Kumar) తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ పగడాల మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ఆయన కుటుంబ సభ్యులే తెల్చిచెప్పిటన్లు ఆయన తెలిపారు. హైదరాబాద్, కోదాడ ప్రాంతాల్లో ప్రవీణ్ వైన్ షాపులకు వెళ్లినట్లు గుర్తించామని అన్నారు. అక్కడ ప్రవీణ్ చేసిన యూపీఐ పేమెంట్స్ (UPI Payments) కూడా సేకరించి ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు చెప్పారు. ప్రవీణ్ పగడాలకు దారిలో మూడు సార్లు ఆక్సిడెంట్ అయినట్లు ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.

కాల్ డేటా పరిశీలన
ప్రవీణ్ పగడాల మృతి చెందిన రోజున మెుత్తం ఆరుగురితో ఫోన్ మాట్లాడినట్లు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. దాంతో పాటు 2 నెలల కాల్ డేటాను బయటకు తీసి పరిశీలించినట్లు చెప్పారు. అందులో ఎవరితోనూ ప్రవీణ్.. అనుమానస్పదంగా మాట్లాడలేదని అన్నారు. మరోవైపు ప్రవీణ్ ది హత్య అంటూ పదే పదే చెప్పిన వారి వద్ద కూడా దానిని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఐజీ తేల్చి చెప్పారు. పూర్తి దర్యాప్తు అనంతరం ప్రవీణ్ ది యాక్సిడెంట్ అని తేలిందని ఐజీ స్పష్టం చేశారు.

Also Read: AP Inter Results: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ స్వేచ్ఛ వెబ్ సైట్ లో..

రాజకీయ దుమారం
ప్రవీణ్ మృతి అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ప్రవీణ్ ది హత్య అంటూ కేఏ పాల్ (KA Paul) తో పాటు పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తందా మారాయి. మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila).. ప్రవీణ్ హత్యపై అనుమానాలు ఉన్నాయంటూ ఎక్స్ (Twitter) వేదికగా ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం (AP Govt).. నిజా నిజాలు తేల్చేందుకు పోలీసు ఉన్నాతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రవీణ్ మృతిపై అనుమానించాల్సిందేది లేదని తాజాగా పోలీసులు తెల్చి చెప్పారు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?