Horror Thriller ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Horror Thriller: అమ్మాయిల హాస్టల్లో దెయ్యాలు, అతీత శక్తులు.. వణుకుపుట్టించే ట్విస్టులతో.. ఎక్కడ చూడొచ్చంటే?

Horror Thriller: మధ్య కాలంలో చాలా మంది ఓటీటీల్లోనే సినిమాలు చూస్తున్నారు. క్రైమ్, థ్రిల్లర్ , హర్రర్ ను ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. అయితే, ఇప్పుడు సినీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు కొత్త కంటెంట్ తో మరో హారర్ వెబ్ సిరీస్ త్వరలో మన ముందుకు రాబోతుంది.

Also Read:  Sodaraa: సంపూ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చిన నిర్మాత.. మ్యాటర్ ఏంటంటే?

ఆ సిరీస్ పేరు ఖౌఫ్. అంటే తెలుగులో భయం అని అర్థం. తాజాగా, ఈ సిరీస్ రిలీజ్ ట్రైలర్ ను వదిలారు. వచ్చే వారం ఈ సిరీస్ ఓటీటీలో సందడీ చేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 18 నుంచి ” ఖౌఫ్ ” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దీనిలో రజత్ కపూర్, చమ్ దరంగ్ ముఖ్య పాత్రలలో నటించగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అందర్ని భయపెడుతుంది. ముఖ్యంగా, భారీ ట్విస్టులు.. కళ్ళు చెదిరే విజువల్స్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

Also Read: NH 163 G Land Acquisition: ఎన్‌హెచ్‌ 163జి భూసేకరణపై సమీక్ష.. కలెక్టర్ ప్రావీణ్య కీలక ఆదేశాలు

కథ ఏంటంటే?

అమ్మాయి అయిన తనకు తానుగా స్వేచ్ఛగా బతకాలని కలలు కంటుంది. అలాంటి అమ్మాయే మాధురి కూడా.. తను ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని ఢిల్లీకి వెళ్తుంది. ఇక అక్కడి నుంచి కథ మొదలవుతుంది. స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీకి వచ్చిన మాధురి తన వద్ద ఉన్న డబ్బుతో మారుమూల హాస్టల్లో ఓ రూమ్ దొరుకుతుంది. అయితే, హాస్టల్లోకి వెళ్ళగానే అక్కడున్న అమ్మాయిలు మాధురిని చుట్టుముడుతారు. ఆమెకి లేనిపోనివి అన్ని చెప్పి టార్చర్ చేస్తారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. ఆ తర్వాత నువ్వు వెళ్లాలనుకున్న అసలు వెళ్లలేవని, ప్లేస్ అలాంటిదని చెబుతారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకుండా మాధురి అక్కడే ఉంటుంది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఆ గదిలో దెయ్యాలు, అతీత శక్తులు ఉన్నాయని తెలుసుకుంటుంది. వాటితో ఆమె ఎన్ని సమస్యలు ఎదుర్కొంది? భూత వైద్యుడి సాయంతో ఆమె ఏం కనుక్కుంది ? మస్యల నుంచి ఆమె ఎలా బయటపడింది ? అనేది సిరీస్. ఏప్రిల్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ అవ్వగానే చూసేయండి!

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?