NH 163 G Land Acquisition: హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాల మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 163జి భూసేకరణ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య[ IAS Pravinya ] అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరకాల నియోజకవర్గం పరిధిలో నేషనల్ హైవే కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై ఆర్డీవో డాక్టర్ నారాయణ, తహసిల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల పరిధిలో భూసేకరణ ప్రక్రియ, రైతుల భూములకు పరిహారం చెల్లింపు, తదితర వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అదనంగా కావాల్సిన 12.38 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ, గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే భీమదేవరపల్లి, వేలేరు మండలాలకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను గురించి హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
AlSO Read: Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం.. నెక్ట్స్ అరెస్టా? విచారణా?
భూ సేకరణకు కావలసిన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. అదేవిధంగా ఎల్కతుర్తి జంక్షన్ నుండి ముల్కనూర్ వైపు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల పురోగతి గురించి జాతీయ రహదారుల శాఖ అధికారులను కలెక్టర్[ IAS Pravinya ]అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటిపై కలెక్టర్[ IAS Pravinya ]సమీక్షించారు. ఈ సమావేశంలో పరకాల డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, జాతీయ రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు