Phone Tapping case [ image credit; twitter or al ]
తెలంగాణ

Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం.. నెక్ట్స్ అరెస్టా? విచారణా?

Phone Tapping case: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు [Phone Tapping case] కీలకమైన మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్​ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్​ రావు [Prabhakar Rao] పాస్​ పోర్టును అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పాస్ పోర్ట్​ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్​ పోలీసులకు సమాచారాన్ని అందించారు.  ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్​ రావును వీలైనంత త్వరగా ఇక్కడికి రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభాకర్​ రావు [Prabhakar Rao] విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.  విచారణకు వచ్చినపుడు ప్రభాకర్​ రావును అరెస్ట్​ చేస్తారా? లేక నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తారా? అన్నది సస్పెన్స్​ గామారింది. దీనిపై ఓ దర్యాప్తు అధికారితో మాట్లాడగా ముందస్తు బెయిల్ కోరుతూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్​ పై హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులపై ఈ అంశం ఆధారపడి ఉంటుందన్నారు. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని రోజులకే ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే.

 Also Read: Mulugu District: ప్రెషర్ మైన్లతో ములుగు ప్రజల ప్రాణాలకు ముప్పు.. జిల్లా ఎస్పీపి శబరిష్ సూచన

ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్​ రావు ప్రత్యేకంగా ఓ బృందంతోపాటు తన ఆఫీస్​ లో ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకుని ఈ బాగోతాన్ని నడిపించినట్టు బయట పడింది. రాష్ట్ర కాంగ్రెస్​ అగ్ర నాయకులతోపాటు బీఆర్​ఎస్​ లోని కీలక నేతలు పోటీ చేసిన అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో నిలబడ్డ కాంగ్రెస్​ నేతలు, వారి బంధుమిత్రుల ఫోన్లను ట్యాప్​ చేసినట్టుగా బయటపడింది. దాంతోపాటు కాంగ్రెస్​ పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారని భావించిన పలువురు పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్​ చేసినట్టుగా వెల్లడైంది.

దీంట్లో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్​ ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్ [DGP Radhakrishnan]​ రావుతోపాటు ఓ టీవీ ఛానల్​ అధినేత శ్రవణ్ రావు [Sravan Rao]కీలక పాత్ర పోషించినట్టుగా స్పష్టమైంది.  సిట్​ అధికారులు మాజీ డీఎస్పీ ప్రణీత్​ రావుతోపాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్​ రావులను అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం శ్రవణ్​ రావును విచారిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అప్పటి ఎస్​ఐబీ ఛీఫ్​ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే అంతా కలిసి ఫోన్లను ట్యాప్​ చేసినట్టుగా తేలింది.

 Also Read: Collector Muzammil Khan: ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు వేగవంతం.. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

కేసు నమోదు కాగానే…
కాగా, ఫోన్​ ట్యాపింగ్​ కు సంబంధించి కేసు నమోదు కాగానే ప్రభాకర్​ రావు [Prabhakar Rao] అమెరికా వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని సిట్​ అధికారులు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ మెయిల్​ ద్వారా విచారణాధికారులకు సమాచారం ఇచ్చారు. వర్చువల్​ గా విచారణకు సహకరించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, [Prabhakar Rao] ప్రభాకర్​ రావును నిశితంగా విచారించినపుడే ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

దీనిపై ఓ అధికారితో మాట్లాడగా బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రులు ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్​ రావును టీవీ ఛానల్​ అధినేత శ్రవణ్​ రావుకు పరిచయం చేసి ఈ వ్యవహారాన్ని నడిపించినట్టుగా ఇప్పటికే వెల్లడైందన్నారు.

రెడ్​ కార్నర్​ నోటీసులు…
ఈ క్రమంలోనే ప్రభాకర్​ రావును వెనక్కి రప్పించేందుకు సీబీఐ ద్వారా అతని పేరు మీద రెడ్​ కార్నర్ నోటీస్​ జారీ చేయించారు. ఆ వెంటనే ప్రభాకర్​ రావు తనకు ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. అయితే, ఫోన్​ ట్యాపింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు ఎట్టి పరిస్థితుల్లోనూ [Prabhakar Rao] ప్రభాకర్​ రావు వెనక్కి వచ్చేలా చూడాలని నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే అతని పాస్​ పోర్టును రద్దు చేయాల్సిందిగా పాస్​ పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియాను కోరింది. దీనిపై స్పందించిన పాస్ పోర్ట్​ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు [Prabhakar Rao] ప్రభాకర్​ రావు పాస్​ పోర్టును రద్దు చేశారు. విషయాన్ని హైదరాబాద్​ పోలీసులకు తెలిపారు.

 Also Read: Malkajgiri court: పోక్సో కేసు నిందితునికి 2‌‌0యేళ్ల జైలు శిక్ష.. ఆపై!

వడివడిగా చర్యలు…
[Prabhakar Rao] ప్రభాకర్​ రావును వెనక్కి రప్పించేందుకు సిట్​ అధికారులు వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వర్గాల ద్వారా ప్రభాకర్​ రావు [Prabhakar Rao] పాస్​ పోర్ట్​ రద్దయిన విషయాన్ని అమెరికా కాన్సులేట్​ వర్గాలకు తెలియచేశారు. ఈ క్రమంలో అమెరికన్ పోలీసులు ఏ క్షణమైనా [Prabhakar Rao] ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుని మన దేశానికి డిపోట్​ చేయవచ్చని ఓ సీనియర్​ పోలీసు అధికారి చెప్పారు.

రెడ్​ కార్నర్ నోటీస్​ జారీ అయి ఉన్న నేపథ్యంలో ఆయన దేశంలోని ఏ విమానాశ్రయంలో దిగినా వెంటనే భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటాయన్నారు. ఆ తరువాత హైదరాబాద్​ పోలీసులకు అప్పగిస్తాయని తెలిపారు. ఈ వారంలోనే ప్రభాకర్​ రావు స్వదేశానికి తిరిగి రావచ్చన్నారు. 

Bhubharathi portal: భూ భారతి చట్టంతో రెవెన్యూకు కొత్త ఊపిరి.. జేఏసీ చైర్మన్.. వి.లచ్చిరెడ్డి

అరెస్టా?…విచారణా?…
ఇక, రాక తప్పని పరిస్థితి నెలకొని ఉన్న నేపథ్యంలో [Prabhakar Rao] ప్రభాకర్​ రావు అరెస్ట్ తప్పక పోవచ్చన్న చర్చ పోలీసువర్గాల్లో జోరుగా నడుస్తోంది. కాగా, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన పట్ల దర్యాప్తు అధికారులు అంత కఠినంగా వ్యవహరించక పోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారణలో పాల్గొంటున్న ఓ అధికారితో మాట్లాడగా ప్రభాకర్ రావు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్​ పిటిషన్​ పై హైకోర్టు వెలువరించే ఉత్తర్వులపై ఇది ఆధార పడి ఉందన్నారు.

అరెస్ట్​ చేయవద్దంటూ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించినా, ముందస్తు బెయిల్​ మంజూరు చేసినా [Prabhakar Rao] ప్రభాకర్​ రావును విచారణకు పిలిపించి ప్రశ్నిస్తామన్నారు. లేనిపక్షంలో ప్రశ్నిస్తామని, దర్యాప్తునకు ఆయన సహకరించక పోతే అరెస్ట్​ కూడా చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్