Mulugu District: రక్షణ పేరుతో కర్రెగుట్టపై ప్రెషర్ మైన్స్ ఆమర్చి అమాయక ప్రజల ప్రాణాలను సిపిఐ మావోయిస్టులు బలిగొంటున్నారని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ తెలిపారు. కర్రెగుట్ట ప్రాంతానికి ప్రజలు వేట కోసం ఎవరు రావద్దని వెంకటాపురం వాజేడు మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత విడుదల చేసిన లేక కు కౌంటర్ గా జిల్లా ఎస్పీ శబరిష్ మంగళవారం ఎస్పీ ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం…
ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో దాని ప్రాబల్యం పూర్తిగా తుడిచి పెట్టుకొని పోయింది. మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదు. ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు ఎవరు నమ్మడం లేదు. మావోయిస్టు పార్టీ కేవలం తన ఉనికిని చాటుకోవడానికి, ఆ పార్టీ నాయకుల స్వప్రయోజనాల కోసం ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని సరిహద్దు కర్రేగుట్ట ఆటవి ప్రాంతంలో మావోయిస్టుల మతిభ్రమించి రక్షణ పేరుతో ప్రజలు నిత్యం తిరిగే ప్రదేశాలలో ప్రెషర్ మైన్స్ పెట్టి వారి ప్రాణాలు బలిగొంటున్నారు.
ఈ విధంగా సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వారు పెట్టిన ప్రేషర్ మైన్స్ వల్ల బలి అవుతున్న అమాయక గిరిజన, గిరిజనేతర ప్రజలపై పోలీస్ ఇన్ఫార్మర్ అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సిపిఐ మావోయిస్టు పార్టీ అమర్చిన ప్రేషర్ మైన్స్ వలన కర్రేగుట్ట పైకి పశువులను మేపటం కోసం వెళ్లిన ముకునూర్ పాలెం గ్రామానికి చెందిన మూగ, చెవిటి వ్యక్తి అయినా సోయం పెంటయ్య, వేదురు బొంగుల కోసం వెళ్లిన కొంగల గ్రామానికి ఇల్లందుల ఏసు ఈ ఇద్దరు చనిపోగా, దైవ దర్శనం కోసం వెళ్లిన చొక్కాల గ్రామానికి చెందిన డర్రా సునీత మరియు చేపల వేటకు వెళ్లిన అంకన్న గూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్, వంట చెరుకు కోసం వెళ్లిన ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి తీవ్రగాయాలపాలయ్యారు.
పౌర హక్కుల సంఘాలు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మావోయిస్టుల చర్యలను ఖండిచాలని వారిని కోరడం జరుగుతుంది. ములుగు జిల్లా, బీజాపూర్ జిల్లా సరిహద్దులలోని వివిధ గ్రామాల గిరిజన మరియు గిరిజనేతర ప్రజలు పూర్తిగా అటవీ ఉత్పత్తులపై మరియు పశువుల పెంపకం పై ఆధారపడి వారి జీవనం కొనసాగిస్తూ ఉంటారు, వారు నిత్యం తిరిగే ప్రదేశాలలో మావోయిస్టులు ప్రెషర్ మైన్స్ ఆమర్చి వారి జీవించేహక్కు ను కాలరాస్తున్నారు.
Also Read; Hydra on Alwal: అక్రమాలపై రంగనాథ్ దృష్టి .. స్మశానవాటికకు రక్షణ
సిపిఐ మావోయిస్టులు అమర్చినటువంటి ప్రెషర్ మైన్స్ ను వెంటనే వారు వాటిని తొలగించాలి, సరిహద్దు గ్రామాలలోని ప్రజలు ఎవరు భయపడకూడదు అని ప్రజల భద్రతపై ములుగు పోలీస్ పటిష్టమైన భద్రతపరమైన చర్యలు తీసుకుంటుందని, నిత్యం బాంబు నిర్వీర్యం చేసే బృందాలతో కర్రేగుట్ట పై తనిఖీలు చేస్తూ మావోయిస్టులు అమర్చినట్టువంటి ప్రేషర్ మైన్స్ ఎప్పటికప్పుడు తొలగిస్తుందని, ఎవరికైనా అనుమానాస్పదంగా ఆటవి ప్రాంతంలో మైన్స్ కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ములుగు ఎస్పీ తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు