Bhubharathi portal: భూ భారతి చట్టంతో రెవెన్యూకు కొత్త ఊపిరి..
Bhubharathi portal [ image credit: swetcha reporter]
Telangana News

Bhubharathi portal: భూ భారతి చట్టంతో రెవెన్యూకు కొత్త ఊపిరి.. జేఏసీ చైర్మన్.. వి.లచ్చిరెడ్డి

Bhubharathi portal: రాష్ట్రంలో నూతనంగా అమలులకి రాబోతున్న భూ భారతి చట్టం రెవెన్యూ వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరగడంతో పాటు రెవెన్యూ సేవలు, పౌర సేవలు ఫర్ ఫెక్ట్ గాచేరతాయన్నారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కావడం వలన రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఆర్డీవో కె. రామకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ లోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందన్నారు.

Also Read: Kodanda Reddy: రైతు ర్యాయితీలకు పూసగింజలు .. ఉద్యానవన పంటలకు కొత్త వెలుగు.. రైతు కమిషన్ చైర్మన్

రెవెన్యూ ఉద్యోగులు కూడా పునరేకీకరణ కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి జీ పీవో (గ్రామ పరిపాలన అధికారి)లుగా వస్తున్న పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలు సర్వీసు పరమైన అ భద్రతకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం జీపీవో పోస్ట్ కొత్తగా క్రియేట్ చేసిందని, అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగానే జీ పీవోలకు కూడా పదోన్నతులు వస్తాయన్నారు.

ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీవోలందరికీ కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వచ్చిట్లుగానే కామన్ సర్వీస్ తో పాటు పదోన్నతులు వస్తాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సమీప భవిష్యత్తులోనే ఓ భరోసా దొరుకుతుందన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

SLBC Tunnel Update: 46వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. అగాధంలో ఆశ కోసం పోరాటం!

అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ సహకారంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టులను సాధించామన్నారు. అలాగే గతంలో ధరణిలో తహశీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు లేని కారణంగా రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. కానీ త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టంలో తహశీల్దార్లకు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు.

డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ మాట్లాడుతూ..రాష్ట్రంలో కొద్ది నెలల కిందటి వరకు రెవెన్యూ ఉద్యోగుల భవిష్యత్తు, రెవెన్యూ వ్యవస్థ ప్రశ్నార్థకంగా ఉండేదని ,గతంలో నిర్వీర్యమైన రెవన్యూ వ్యవస్థ నేడు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుందన్నారు. గ్రామానికి బొడ్డు రాయివలే ఉన్న రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యానికి అంగీకారం తెలిపిన కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల బాధ్యత రాహిత్యం కారణంగానే రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ విచ్ఛిన్నమైందన్నారు.

 Also Read: Hanuman Shobha Yatra: హనుమాన్ విజయయాత్రకు.. పోలీసులను అలర్ట్ చేసిన సీ.వీ.ఆనంద్

గ్రామ స్థాయిలో లేకుండా పోయిన గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుందన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన సభలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోశాధికారి వెంకట్ రెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, అసోసియేట్ అధ్యక్షులు చల్ల శ్రీనివాస్, టీజీజీఏ సెక్రటరీ జనరల్ సెక్రటరీ పూల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?