Malkajgiri court: పోక్సో కేసు నిందితునికి 2‌‌0యేళ్ల జైలు శిక్ష.. ఆపై!
Malkajgiri court (imagecredit:twitter)
క్రైమ్

Malkajgiri court: పోక్సో కేసు నిందితునికి 2‌‌0యేళ్ల జైలు శిక్ష.. ఆపై!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Malkajgiri court: మైనర్​ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితునికి మల్కాజిగిరి జిల్లా పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష, మరియు 5వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలికి పరిహారంగా 5లక్షల రూపాయలు అందచేయాలని ఆదేశించింది.

మల్లాపూర్​ నివాసి బచ్చన్​ ప్రసాద్​ (64) ప్రైవేట్​ ఉద్యోగి. తాను ఉంటున్న ఇంటి కాపౌండ్​ లోనే నివాసముంటున్న కుటుంబంలోని మైనర్​ బాలికపై బచ్చన్​ ప్రసాద్​ గతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు నాచారం పోలీసులు కేసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్​ చేశారు. విచారణ పూర్తి చేసిన తరువాత కోర్టుకు ఛార్జిషీట్​ దాఖలు చేశారు.

కేసును విచారించిన కోర్టు నిందితునికి జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉపేందర్​, సుశీల వాదనలు వినిపించారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?