Ganja Seized: స్కూల్ వద్ద గంజాయి అమ్ముతున్న గ్యాంగును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3.8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మారేడ్ పల్లి నివాసి టమాట సంజయ్ (24) మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ గా నమోదై ఉన్నాడు. యాప్రాల్ బాలాజీనగర్ నివాసి శివ సింగ్ (24), శాంతినగర్ వాస్తవ్యుడు జ్వాలా దీపాన్షు కుమార్ (22), ఖమ్మంకు చెందిన రావుల నరేష్ (18) స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించేందుకు సంజయ్ కొంతకాలంగా గంజాయి దందా చేస్తున్నాడు. అరకు ప్రాంతానికి చెందిన సుబ్బారావు నుంచి గంజాయి కొని తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నాడు.
Also Read: Etela Rajender: కాళేశ్వరం కమిషన్ నోటీసులపై.. వాస్తవాలు చెప్పాలని స్పష్టం!
ఎప్పటిలానే శివ సింగ్, రావుల నరేష్ లు ఇటీవల అరకు వెళ్లి సుబ్బారావు నుంచి గంజాయి కొని తీసుకొచ్చారు. దీనిని బాలాజీనగర్, యాప్రాల్, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఆదివారం రాత్రి దీపాన్షు కుమార్, రావుల నరేష్ లు మిషన్ మోడల్ స్కూల్ వద్ద గంజాయి అమ్ముతుండగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ రాఘవేందర్, ఎస్సైలు జ్ఞానదీప్, శ్రీనివాసులు దాసు, రాఘవేంద్ర రెడ్డితోపాటు బొల్లారం డీఐ ప్రభాకర్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. ఆ తరువాత సంజయ్, శివ సింగ్ లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్షా 75వేల రూపాయల విలువ చేసే గంజాయిని సీజ్ చేశారు.
Also Read: Coronavirus In TG: కొవిడ్ సీజనల్ అలర్ట్.. ప్రజల ఆరోగ్యం కోసం ముందస్తు ప్లాన్!