Coronavirus In TG( iamge credit: twitter)
తెలంగాణ

Coronavirus In TG: కొవిడ్ సీజనల్ అలర్ట్.. ప్రజల ఆరోగ్యం కోసం ముందస్తు ప్లాన్‌!

Coronavirus In TG: వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నమోదవుతున్న కేసుల తీరుతో తెలంగాణకు ఎలాంటి ప్రమాదం లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నంబికూరి తనకు వివరించారని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. సోమవారం ఆయన కొవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై సెక్రటేరియట్ లో నిపుణులు, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఇప్పటివరకూ ఉన్న సమాచారం, పరిశోధనల ప్రకారం కొవిడ్ తో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదన్నారు. వివిధ దేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా, హాస్పిటలైజేషన్ కేసులు లేవన్నారు.

దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. సాధారణ ప్రజలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు కనిపించడం లేదన్నారు. కొవిడ్ పై ఎక్స్ పర్ట్స్ ఎప్పటికప్పుడు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారని, సైలెంట్ గా కేసులు పెరిగినా, క్రమంగా తగ్గుదల కూడా ఉన్నదన్నారు. కొందరిలో కొవిడ్ వచ్చి పోయిన విషయం కూడా తెలియడం లేదన్నారు.

Also ReadMinister Seethaka: ట్రాన్స్ జెండర్లకు అవకాశాలపై.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు!

మన రాష్ట్రంలో, దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యునిటీ వచ్చినందున పెద్దగా, కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. పరిస్థితి సాధారణంగా ఉండడం వల్ల, కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇప్పటివరకూ ఎటువంటి అడ్వైజరీ, గైడ్‌లైన్స్ విడుదల చేయలేదని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా కూడా ప్రకటించారన్నారు. అయితే కొవిడ్‌పై నిరంతరం నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ఇక రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సాంపిళ్లు పంపించాలని సీసీఎంబీ, సీడీఎఫ్​ డీ డైరెక్టర్లు విజ్ఞప్తి చేశారని మంత్రి వెల్లడించారు. సీక్వెన్సింగ్ ను ఫాలఫ్​ చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ను ఆదేశించారు.

సీజనల్ అలర్ట్…
సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, బీబీనగర్ ఎయిమ్స్‌, నిమ్స్‌ తదితర సంస్థలతో కలిసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ ,ఇన్‌ఫ్లుయేంజా లైక్ ఇల్‌నెస్‌ కేసులను సర్వైలెన్స్ చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌, మునిసిపల్, ఇతర డిపార్ట్‌మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ప్రతి గ్రామంలో, పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాద్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.

డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌, మునిసిపల్ డిపార్ట్‌మెంట్లను అలర్ట్ చేయాలని, ఆరోగ్యశాఖ నుంచి స్పెషల్ టీమ్‌లను పంపించి అవేర్‌‌నెస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయని, సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్నారు. అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్, మెడికల్ రీఏజెంట్స్‌ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

Also Read: GHMC officials: మళ్లీ మునక తప్పదా?.. పూడికతీత పనులపై అనుమానాలు ఎన్నో?

సానిటేషన్, డైట్ నిర్వాహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో ప్రైవేటు హాస్పిటళ్లపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్‌లెట్స్‌ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో వాటర్‌‌బోర్న్‌(డయేరియా, టైఫాయిడ్…), వెక్టార్ బోర్న్‌ (డెంగీ, మలేరియా..) జబ్బుల నివారణ, నియంత్రణకు సూచనలు ఇవ్వాలని నిపుణులను మంత్రి కోరారు. వెక్టార్‌‌బోర్న్‌ డిసీజ్‌ల నియంత్రణ కోసం, ఎప్పటికప్పుడు నీటి సాంపిల్స్‌ను పరీక్షించి, నివేదికలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి సాంపిల్స్‌ను సేకరించి, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ తదితర ల్యాబులకు పంపించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

వర్షాలు మొదలైనందున వానాకాలం పంటలను రైతులు ప్రారంభిస్తారని, ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి గుర్తు చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్‌ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ అభిషేక్ అరోరా, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్ , ఐసీఎంఆర్‌‌ ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త, డాక్టర్ సుదీప్‌ ఘోష్‌, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Covid-19 Cases TG: రాష్ట్రంలో కరోనా భయాలు.. మంత్రి కీలక ఆదేశాలు!

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!