Etela Rajender: కాళేశ్వరం కరప్షన్, ప్రాజెక్టు కుంగిపోవడంపై బీజేపీ ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు చేసింది. అయితే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఈ ఇష్యూ పార్టీకి చుట్టుకుంది. దీంతో ఈ ఇష్యూపై పార్టీ సైలెంట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ అంశంపై ఈటలకు హైకమాండ్ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవాలు చెప్పాలని భరోసా నింపినట్లు తెలుస్తోంది. హైకమాండ్ ఈ ఇష్యూపై ఇంత కాన్ఫిడెంట్ గా ఉందంటే దీని వెనుకు ఏదో మతలబు ఉందనే చర్చ శ్రేణుల్లో జరుగుతోంది. ఈ ఇష్యూ ఆధారంగానే బీఆర్ఎస్ కు చెక్ పెట్టి బీజేపీకి మైలేజ్ వచ్చేలా వ్యూహరచన చేపట్టినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం పాపమంతా కేసీఆర్ దేనని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ ఎత్తుగడ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాత్ర ఎంత? విచారణ కమిషన్ ఎదుట ఆయన ఏం చెప్పబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ప్రాజెక్ట్ కు ఫైనాన్స్ అనుమతులన్నీ ఈటల హయాంలోనే జరిగాయి.
Also Read: Coronavirus In TG: కొవిడ్ సీజనల్ అలర్ట్.. ప్రజల ఆరోగ్యం కోసం ముందస్తు ప్లాన్!
అయితే అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ కార్పొరేషన్ నుంచే కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇతర ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా పద్దు క్రియేట్ చేసి కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నేరుగా ఆర్థిక శాఖకు సంబంధం లేకుండానే ప్రత్యేక కార్పొరేషన్ నుంచి బిల్లుల చెల్లింపు జరిగిందని ఈటల వర్గీయులు చెప్పుకుంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటల బీజేపీలో చేరారు. ఆ పార్టీలో కీలకనేతగా ఎదిగారు. కాగా ఈటలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 6వ తేదీన కమిషన్ ఎదుట హాజరుకానున్నట్లు ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ విషయంపై ఢిల్లీ పెద్దలకు ఈటల వివరించినట్లు సమాచారం. వారి డైరెక్షన్స్ మేరకే విచారణ కమిషన్ ఎదుట పూర్తి వివరాలు తెలియజేసే అవకాశాలున్నాయి.
Also Read: Minister Seethaka: ట్రాన్స్ జెండర్లకు అవకాశాలపై.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు!
కమిషన్ ఎదుట ఏం చెప్పాలనే దానిపై పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. హైకమాండ్.. నేరుగా ఆర్థికశాఖకు సంబంధం లేకుండా బిల్లులు మంజూరుచేయడం, ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం, స్పెషల్ పద్దు చెల్లింపులు చేయడాన్ని అస్త్రంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈటల రాజేందర్ సైతం అన్నీ క్లియరెన్సులు వచ్చాక కేవలం నిధులు మంజూరు చేయడం వరకే ఆర్థిక శాఖ పని అని చెబుతున్నారు.
కాగా ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి సైతం ఈటలకు డైరెక్షన్స్ వెళ్లినట్లు తెలిసింది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అవినీతిని కమిషన్ ఎదుట ఉన్నది ఉన్నట్లు చెప్పాలని కిషన్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. ఓ వైపు బీజేపీలో కొత్తసారథి ఎన్నికకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈటలకు విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ గా ఈటలకు బ్రేకులు వేయడానికే నోటీసులు ఇచ్చారా? కాషాయ పార్టీలోనే తెరచాటు మంత్రాంగం ఏదైనా నడుస్తోందా ? అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి.
Aslo Raed: GHMC officials: మళ్లీ మునక తప్పదా?.. పూడికతీత పనులపై అనుమానాలు ఎన్నో?