Double Bedroom Scam: డబుల్ బెడ్రూమ్ ఇండ్లు(Double Bedroom Houses) ఇప్పిస్తానంటూ పదుల మందికి టోకరా ఇచ్చిన కేటుగాని ఉదంతమిది. డబ్బులిచ్చి రెండేళ్లు గడిచినా ఇండ్లు దక్కకపోవటంతో సదరు చీటర్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఫీర్జాదిగూడ నివాసి నాగరాజు (Nagaraju) తనను తాను డబుల్ బెడ్ రూం ఇండ్ల(Double Bedroom Houses) కాంట్రాక్టర్ అని చెప్పుకొనేవాడు. దాంతోపాటు తనకు పలువురు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్టుగా ప్రచారం చేసుకునేవాడు. ఇలా పలువురిని ఉచ్చులోకి లాగిన నాగరాజు ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయల చొప్పున తీసుకున్నాడు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
30 మంది బాధితులు
అయితే, రెండేళ్లు గడిచినా ఏ ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు(Double Bedroom Houses, )మాత్రం ఇప్పించలేదు. అతని చుట్టూ తిరిగి తిరిగి వేసారిన బాధితులు ఇటీవల తమ నుంచి తీసుకున్న డబ్బును వాపసు చేయాలని అడగటం మొదలు పెట్టారు. అప్పట్నుంచి నాగరాజు (Nagaraju) వారికి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో దాదాపు 30 మంది బాధితులు నాగరాజు నివాసం ముందు ఆందోళన దిగారు. మేడిపల్లి పోలీసు(Medipalli Police)లకు ఫిర్యాదు ఇవ్వనున్నట్టు బాధితులు వెల్లడించారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ