GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: బాగు చేస్తే మేలులెన్నో.. అమలుకు నోచుకోని స్టాండింగ్ కమిటీ తీర్మానం

GHMC: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు రౌండ్ ది క్లాక్ అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ(GHMC) ఇంకా పూర్తిగా ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోకముందే ఆదాయంపై కొన్నివిభాగాలు అశ్రద్ధ వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా జీహెచ్ఎంసీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకే ప్రాపర్టీ ట్యాక్స్(Property tax) చెల్లిస్తున్న భవనాలపై జీఐఎస్ సర్వే నిర్వహిస్తున్నామని, కమర్షియల్ గా వినియోగిస్తూ రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్న వేలం సంఖ్యల ఆస్తులను గుర్తిస్తున్నామని చెప్పుకునే అధికారులు జీహెచ్ఎంసీ ఇతర ఆదాయ విభాగాలపై దృష్టి సారించటంలో విఫలమవుతున్నారన్న విమర్శ సైతం లేకపోలేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో జీహెచ్ఎంసీకి రూ. లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. వీటిలో కనిష్టంగా రూ. 5 వేల మొదలుకుని రూ. 5 లక్షల వరకు అద్దెలు వచ్చే ఆఫీసు ప్రాంగణాలు, మలిగీలు, మార్కెట్ లోని స్టాళ్లున్నాయి. వీటిలో మున్సిపల్ మార్కెట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు(Multi-purpose function halls) వంటివి ఉన్నాయి. వీటిలో సుమారు సగానికి పైగా ఖాళీగా ఉన్నట్లు తెలిసింది.

కనీసం టెండర్ల ప్రక్రియను కూడా..

ఆక్రమించుకుని ఉన్న మలిగీలు, ఆఫీసు ప్రాంగణాలు, మార్కెట్ లోని స్టాళ్లలో ప్రస్తుతం సబ్ లీజుదారులే తిష్ట వేసి ఉన్నారు. లీజు దారులు జీహెచ్ఎంసీ నుంచి ఏళ్ల క్రితం నామమాత్రం అద్దెకు వీటిని తీసుకుని, వీటిని సబ్ లీజుకిచ్చి ఇపుడు రూ.వేలు, లక్షల్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. అద్దె గడువు ముగిసినవి, ఖాళీగా ఉన్న వాటికి టెండర్లు చేపట్టి, వేరే వారికి కేటాయించేందుకు అధికారులు కనీసం టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టకపోవటతో అద్దె గడువు ముగిసిన లీజుదారులకు, సబ్ లీజుదారులకు వరంగా మారుతుంది. ఖాళీగా ఉన్న సుమారు వెయ్యి 54 మలిగీలను అద్దెకు ఇచ్చేందుకు వేలం పాట నిర్వహించాలని కొద్ది నెలల క్రితమే స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసినా, అది కూడా అమలుకు నోచుకోవటం లేదన్న విమర్శలున్నాయి. ఖాళీగా ఉన్న మలిగీలు, మార్కెట్లలోని స్టాళ్లను అద్దెకు ఇచ్చేందుకు వేలం నిర్వహించాలని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు ప్రధాన కార్యాలయం అధికారులు మూడుసార్లు రిమైండర్లను జారీ చేసినా, కొన్ని సర్కిళ్లలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేలం నిర్వహించలేదు.

Also Read; MP Raghunandan Rao: జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యం: ఎంపీ రఘునందన్ రావు

ఏడాది క్రితం.. 

గత సంవత్సరం తక్కువ కాలం కమిషనర్ గా సేవలందించిన అమ్రపాలి ప్రతి రోజు జీహెచ్ఎంసీ శానిటేషన్ పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు పనులను తనిఖీ నిర్వహించేందుకు చేపట్టిన మార్నింగ్ వాక్ లో చిక్కడపల్లిలోని ఆధునీక మున్సిపల్ మార్కెట్ ను నిర్మించినా, అద్దెదారులకు కేటాయించకోవటంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె వెంటనే టెండర్లు చేపట్టి, అద్దెకు కేటాయిస్తే జీహెచ్ఎంసీకి నిధులు సమకూరుతాయని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన జరిగి ఏడాది గడిచిపోయినా, ఇంకా చిక్కడపల్లి మార్కెట్ ఖాళీగానే ఉంది. దీంతో అధికారులు హడావుడిగా ఒక సారి టెండర్ల ప్ర్రక్రియ చేపట్టారు. అద్దెదారులెవ్వరూ ముందుకు రాకపోవటంతో టెండర్లు చేపట్టడం కూడా మరిచారు. ఇందుకు సంబంధించి చిక్కడపల్లిలో సర్వ హంగులతో నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కు తగినంత పార్కింగ్ స్పేస్ లేకపోవటంతో అద్దెదారులు ముందుకు రావటం లేదని తెలిసింది. సిటీలోని ఇతర వ్యాపార సంస్థలకు వ్యాలెట్ పార్కింగ్ సిస్టమ్ ను అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ తన సొంత ఆస్తులను అద్దెకిచ్చేందుకు, ఆదాయం పెంచుకునేందుకు తన మార్కెట్ భవనాలకెందుకు వ్యాలెట్ పార్కింగ్ సిస్టమ్ ను అమలు చేయదన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఆదాయం పెరిగినట్టే పెరిగి… 

జీహెచ్ఎంసీ ఆస్తుల లీజుకు కేటాయించటం, ప్రతి నెల అద్దెలు చెల్లించటం వంటి బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీలో ఎస్టేట్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, దానికో అదనపు కమిషనర్ ను సైతం నియమించారు. గత సంవత్సరం నవంబర్ మాసంలో జీహెచ్ఎంసీకి కమిషనర్ గా ఇలంబర్తి వచ్చిన తర్వాత ఆయన చేసిన వత్తిడి, ఇచ్చిన టార్గెట్ల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.4 కోట్లకే పరిమితమైన ఎస్టేట్ ఆదాయం ఆయన వచ్చిన తర్వాత లీజుదారులు, సబ్ లీజుదారులకు నిర్వహించిన హియరింగ్ కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయి. ఏళ్ల తరబడి పెండింగ్ లోఉన్న అద్దెలు వసూలు కావటంతో 2024-25 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు కల్లా ఎస్టేట్ ఆదాయం రూ.6 కోట్లకు ఆకస్మికంగా పెరిగింది. ఇలంబర్తి కమిషనర్ గా ఉన్నపుడు మార్చి నెలాఖరు కల్లా రూ. 10 కోట్లు దాటించాలన్న టార్గెట్ పెట్టుకున్న అధికారులు ఆయన బదిలీ అయి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా తుస్సుమన్నారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న పలు ప్రాంతాల్లోని సుమారు 400 మలిగీలను రెండేళ్ల చొప్పున అద్దెకు ఇచ్చేందుకు టెండర్లు చేపట్టాల్సి ఉండగా, ప్రస్తుతం ఎస్టేట్ విభాగం అధికారులు ఆ విషయాన్ని ప్రస్తావించేందుకు కూడా ఇష్టపడటం లేదని తెల్సింది. కొద్ది నెలల క్రితం కమిషనర్ గా వచ్చిన ఆర్. కర్ణన్ ప్రత్యేక చొరవ తీసుకుని, జీహెచ్ఎంసీ ఆస్తులను డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి, టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలన్న వాదనలు విన్పిస్తున్నాయి.

Also Read: Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Just In

01

Roja: 90స్ క్వీన్ రీ ఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత ‘సంతానం’గా రోజా!

Khammam District: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆర్టీసీ అద్దె బస్సులో అకస్మాత్తుగా పొగలు.. భయంతో జనం పరుగులు

Gadwal District: గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలుకు కొర్రీలు.. ఆందోళనలో రైతన్నలు

Fauzi: ప్రభాస్ ‘ఫౌజి’లో తనయుడు.. కన్ఫర్మ్ చేసిన హీరో సుధీర్ బాబు!

Revolver Warning: భూపాలపల్లి జిల్లాలో గన్నుతో బీజేపీ నేత హల్ చల్.. కేసు వాదిస్తే చంపుతా అని బెదిరింపు