Musi River: మొదటి దశలో 19 కి.మీ మేర శుద్ధి
మూసీ బాధితులను తరలించేందుకు కార్యచరణ
ఇప్పటికే అనేక మంది కుటుంబాలు స్వచ్ఛంధ తరలింపు
ప్రతి ఒక్కరిని ఒప్పించి, న్యాయంగా పరిహారం అందించేలా ఏర్పాట్లు
మార్చి నాటికి పనులు ప్రారంభమయ్యే అవకాశం
ప్రతిపాదనలు రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నం
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణలో (Telangana) అత్యంత ప్రధానమైన నది మూసి (Musi River)… ఈ నది రాష్ట్ర రాజధాని నడిబొడ్డు నుంచి ప్రవహిస్తుంది. కానీ మూసి వెంట ప్రయాణించాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే. అలాంటి దుస్థితిలోనున్న మూసిని ప్రక్షాళన చేయడంతో నగరవాసులకు మురుగు కాలుష్యం నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలో పుట్టిన మూసి నది హైదరాబాద్ జిల్లాలోని ప్రధాన పట్టణాల నుంచి వెళ్తూ నల్లగొండ జిల్లా వాడపల్లిలో ముగుస్తోంది. మూసి నది పుట్టి ప్రవహించే వరకు అత్యంత కలుషితమైన నీళ్లతో నల్లొండ ప్రజలు భరిస్తున్నారు. ఈ నది నీటిని ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు వ్యవసాయం చేసుకుంటారు. ఇలాంటి కలుషిత నీటితో పంటలు పండించడంతో రోగాల బారీనపడే అవకాశం అధికంగా ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మూసి నదిని శుద్ద నీటిగా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూసి పరివాహాక ప్రాంతంలో ఉన్న బాధితులను గుర్తించి నష్టపరిహారం ఇచ్చేందుకు అంచనాలు సిద్దం చేసింది. మూడు దశల్లో మూసిని సుందరీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మొదటి దశలో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ భూభాగంలోనున్న 19 కి.మీ పోడవున మూసి సుందరీకరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులు ప్రారంభించనున్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మూసి ఎలివేటేడ్ కారిడార్…
ఈసీ, మూసీ నదుల కలయికతో పాటు గోదావరి నీళ్లను అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదికి 365 రోజులు 24 గంటల పాటు మూసి వాగు నీటితో కళకళలాడేటట్లు రూపకల్పన చేయనున్నారు. అందులో భాగంగానే మూసిని సుందరీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ నదిలో వరద ప్రభావం భారీగా వచ్చినప్పుడు దెబ్బతినే ఇండ్లను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. దాంతో పాటు బఫర్ జోను స్థలాన్ని సేకరించి బాధితులకు న్యాయం చేస్తోంది. సగానికి పైగా మూసి బాధితీలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసింది. కొంత మంది ఆ పరివాహాక ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు వెనకంజ వేస్తున్నారు. వాళ్లతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి నష్టాన్ని వివరించే ప్రయాత్నం అధికారులు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అక్రమ నిర్మాణాలు, పట్టా భూములను సైతం గుర్తించి నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం పరిహారం చేస్తోంది. మూసి నదిలోనే ఎలివేటేడ్ కారిడార్‌కు కూడా ప్రతిపాదనలు రూపోందిస్తున్నారు.
Read Also- PhD on Nifty 50: నిఫ్టీ-50పై పీహెచ్‌డీ.. డాక్టరేట్ సాధించిన తెలుగు వ్యక్తి
జిల్లాలోని 12 గ్రామ రెవెన్యూ పరిదిలో విస్తరణ…
ప్రభుత్వం సూచించినట్లుగా మొదటి దశలో రంగారెడ్డి రెవెన్యూ పరిధిలోని మూసి ప్రక్షాళనకు సన్నహాలు చేస్తున్నారు. ఉస్మాన్, హిమాయత్‌నగర్ నుంచి బాపుఘాట్ వరకు విస్తరించిన మూసి 19 కీ.మీ వరకు శుద్దికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మూసి రంగారెడ్డి జిల్లాలోని 12 రెవెన్యూ గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. అయితే మూసి వెంట అమాయకమైన ప్రజలు ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు కబ్జా చేసుకోని జీవనం సాగిస్తున్నారు. మూసి వరద అధికమైనప్పుడు బాధితులు ఆసమయంలో తలదాచుకునేందుకు మరో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి దుస్థితికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం బాధితులతో మాట్లాడి పక్క ఇండ్లు పంపిణీ చేసి ఆర్ధిక సహాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు కార్యాచరణను ప్రభుత్వం మొదలు పెట్టింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో అక్రమంగా, నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టినట్లు తెలసింది. సుమారుగా 176 నివాసాలు అక్రమంగా నిర్మాణం చేసినట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించారు. 25 మంది నివాస గృహాల ప్రజలు స్వచ్ఛంధం ప్రభుత్వం హామీని ఒప్పుకున్నారు. మిగిలిన వారిలో 70 మంది వారికి ప్రభుత్వం అవగాహాన కల్పించి పరిహారం అందజేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన 12 రెవెన్యూ గ్రామాల పరిధిలో అత్యధికంగా అత్తాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోనే అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Read Also- Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్
నివాసాల నిర్మాణాలకు అనుగుణంగా పరిహారం…
మూసి పరివాహక ప్రాంతం వెంట తెలిసో, తెలియకో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను ఖాళీ చేయాల్సి ఉంది. నివాసాల నిర్మాణాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పక్కగా నిర్మించిన డబూల్ బెడూ రూం ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే డబూల్ బెడ్ రూం ఇండ్ల కంటే ఘోరంగా ఉన్న వాటిని ఆ విధంగా ఖాళీ చేయాలని భావిస్తోంది. తదనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్ల కంటే మెరుగైన నిర్మాణాలకు అదనపు నష్ట పరిహారం తోపాటు ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అందుకు బాధితులను ఓప్పించే ప్రయాత్నం నడుస్తోంది.

