Miyapur Atrocity: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన 5 మంది అనుమానస్పదా స్థితిలో మృతి చెందారు. మియాపూర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ (Miyapur police station) పరిధిలో మక్త మహబూబ్ పేట్ (Maktha mahaboobpet) కాలనీలో నివాసం ఉంటున్న ఉప్పరి లక్ష్మయ్య (60), ఉప్పరి వెంకటమ్మ (55), వారి కూతురు కవిత (24) అల్లుడు అనిల్ (32), మనుమడు అప్పు (2) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
Also Read: BJP Bokka Narasimha: అక్రమ బెట్టింగ్‌కు చెక్.. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం.. బీజేపీ నేతల హర్షం!
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహా ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులది ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలను త్వరలోనే వెల్లడించే అవకాశముంది.
Also Read: Kavitha: టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగింపు.. కేటీఆర్ ఆదేశాలతోనే మార్పు?
అనుమానస్పదంగా చనిపోయిన అనిల్ (32) బుధవారం తనకు ఫోన్ చేసినట్లు అతడి స్నేహితుడు తెలిపాడు. ‘బుధవారం సాయంత్రం 6.30-7.00 మధ్య కాల్ వచ్చింది. రూమ్ షిఫ్ట్ అవుతున్నట్లు అనిల్ చెప్పాడు. సరే మార్నింగ్ వచ్చి కాలుస్తా అని అన్నాను. పొద్దున నాకు కాల్ వచ్చింది. అనిల్ ఫ్యామిలీ మెుత్తం అనుమానస్పదంగా చనిపోయారని చెప్పారు. వెంటనే ఇక్కడకు వచ్చేశా. అసలేం జరిగిందో ఏమో తెలియట్లేదు’ అని అనిల్ స్నేహితుడు వాపోయాడు. అనిల్ సొంతూరు ఏపీలోని అనంతపురం కాగా, అత్త మామాలది కర్ణాటకలోని రంజోల్ గ్రామమని అతడు వివరించాడు.
అనుమానాస్పద మరణాలపై తెలియని కారణాలు
మియాపూర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి ఘటన కలకలం
అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మృతులు కర్ణాటక గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన లక్ష్మయ్య (60), వెంకటమ్మ(55), అనిల్ (32), కవిత… https://t.co/KaZKJ4Y5O9 pic.twitter.com/NF6PgFwutL
— BIG TV Breaking News (@bigtvtelugu) August 21, 2025
Also Read: Sub-Register Office: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వివాదం.. మంచిరెడ్డి కిషన్ రెడ్డి సీరియస్!