Sub-Register Office I9 image CRDIT: TWITTER)
రంగారెడ్డి

Sub-Register Office: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వివాదం.. మంచిరెడ్డి కిషన్ రెడ్డి సీరియస్!

Sub-Register Office: ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపు సమంజసం కాదని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి(Manchireddy Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పాలనను ప్రజలకు దూరం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభించిన ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మూలనపడేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్ కార్యాలయాన్ని లక్డీకాపూల్ నుంచి కొంగరకలాన్ కు, ఆర్డీఓ కార్యాలయాన్ని గోషామహల్ నుండి ఇబ్రహీంపట్నంకు, ఆర్టీఏ కార్యాలయాన్ని హస్తినాపురం నుంచి మన్నెగూడకు తీసుకొచ్చి ప్రజలకు పాలన చేరువ చేశామన్నారు.

Also Read: Toddy Adulteration: గద్వాల జిల్లాలో‌ ఏరులై పారుతున్న కల్తీ కల్లు.. కల్లు దందాలో వారిదే పెత్తనం

 ఎమ్మెల్యే ఏమీ చేస్తున్నారు

ప్రభుత్వ కార్యాలయాలకు అద్భుతమైన భవనాలు నిర్మించామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఏమీ చేస్తున్నారని కిషన్ రెడ్డి(Manchireddy Kishan Reddy) ప్రశ్నించారు. కొహెడను కూడా కాదని మంఖాలకు తరలించెందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలకు కలిగే ఇబ్బందులను ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఆటలాడుతున్నారని విమర్శించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పూర్తయితే ఇబ్రహీంపట్నం పాత గ్రామానికి మహర్దశ అన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడుతామని అన్నారు. సమస్యను జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కి వివరించి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు.

 Also Read: CPI Raja on BJP: భారతదేశంలో ఓటు చోరీ.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ