Vivek Venkataswamy (imagecredit:swetcha)
హైదరాబాద్

Vivek Venkataswamy: రాష్ట్రంలో రెడ్ క్యాట్ కంపెనీలకు నోటీసులు ఇస్తాం: మంత్రి వివేక్!

Vivek Venkataswamy: రెడ్ క్యాటరీ సింపెనీలను గుర్తించి నోటీసులు ఇస్తామని కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) అన్నారు. పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీ(MCRHRD)లో కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఉద్యోగ భద్రతపై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండస్ట్రీలో సేఫ్టీపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాశమైలారం సిగాచి పరిశ్రమల ఏమైందో అందరికి తెలుసు అని, యజమానులకు ఇది ఒక కేస్ స్టడీ అన్నారు.

సిగాచి ప్రమాదంలో..

డైరెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీ దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఎక్కడ సమస్యలు, లోపాలు ఉన్నాయో చెప్పింది.. మానేజ్మెంట్ దృష్టి కి తీసుకెళ్ళిందన్నారు. సిగాచి పరిశ్రమలో భద్రతకు అవసరమయ్యే ఖర్చు 20 లక్షల కంటే ఎక్కువ దాటదన్నారు. మేనేజ్‌మెంట్ తో పాటు బోర్డు సభ్యుల నిర్లక్ష్యం కూడా ఉంటుందని, 20 లక్షలతో సేఫ్టీ మీద దృష్టి పెట్టకపోవడంతోనే సిగాచి ప్రమాదంలో 53 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో సేఫ్టీ ఎన్విరామెంట్(Safety Environment) ఉన్నపుడే.. వర్కర్స్ పని చేయగలుగుతారన్నారు. మేనేజ్ మెంట్ ఎప్పుడు వర్కర్ సేఫ్టీ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఆ వాతావరణం కల్పిస్తే మంచి ప్రొడక్టివిటీ పెరుగుతుందన్నారు.

Also Read: Crime News: డ్రగ్స్​ దందాలో హవాలా వ్యాపారులు.. చిట్టా విప్పిన ఈగల్ టీమ్!

ఏదన్నా ప్రమాదం జరిగితే..

జీరో ఆక్సిడెంట్ ఫ్యాక్టరీస్ గా కంపెనీల్లో ప్రమాణాలు పెంచాలన్నారు. మేనేజ్‌మెంట్, వర్కర్స్ ఇనీషియేటివ్ కంటే సేఫ్టీ అధికారుల పాత్ర ముఖ్యం అన్నారు. రాజకీయంగా కూడా సమస్యలు వస్తాయని, ఎదో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.. మీరు జీరో ఆక్సిడెంట్ ఉండేలా చూడాలన్నారు. ఏదన్నా ప్రమాదం జరిగితే.. డిపార్ట్మెంట్ ను బద్మామ్ చేస్తారని మీరు పూర్తి స్థాయిలో సేఫ్టీ మీద దృష్టి పెట్టి మార్పులు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల భద్రతపై రిఫార్మ్స్ తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల వర్కర్స్ కి సేఫ్టీ మీద ఒక రోజు కొంత టైం శిక్షణ ఇవ్వాలన్నారు.

Also Read: Viral Video: బస్సులో రణరంగం.. డ్రైవర్‌ను ఎగిరెగిరి కొట్టిన మహిళ.. అందరూ షాక్!

Just In

01

Mirai Movie Review: మిరాయ్ సినిమా రివ్యూ.. తేజ సజ్జా హిట్ కొట్టాడా?

Women Bhavan: గుడ్ న్యూస్.. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం..?

HCA Scam: హెచ్​సీఏ పై సీఐడీ విచారణ.. వెలువడుతున్న సంచలన భాగోతాలు..?

Kishkindhapuri Movie Review: కిష్కింధపురి సినిమా రివ్యూ..

Women Mart: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక మహిళలకు పండగే..?