Crime News: దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్లకు సహకరిస్తున్న 20మంది హవాలా వ్యాపారులను ఈగల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 3 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియా(Nigeria) దేశానికి చెందిన ఒన్యేసీ ఎస్మోటీ కెన్నెత్ ఎలియాస్ మ్యాక్స్ వెల్(Oneyasi Esmoti Kenneth Elias Maxwell), ఎలియాస్ ఇమాన్యుయెల్ బెడియాకో(Emmanuel Bediako) జూన్ నెలలో కొకైన్ అమ్మటానికి ప్రయత్నిస్తూ ఈగల్ టీం అధికారులకు పట్టుబడ్డాడు. అతన్ని జరిపిన విచారణలో మాదక ద్రవ్యాలు అమ్మటం ద్వారా వస్తున్న డబ్బును నైజీరియన్లు తమ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపించటానికి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన హవాలా వ్యాపారులు సహకరిస్తున్నట్టుగా వెల్లడైంది.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు
దీని కోసం కమీషన్ రూపంలో భారీ మొత్తాలు తీసుకుంటున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. నగదును బదిలీ చేయటంలో మనీ లాండరింగ్ కు కూడా పాల్పడుతున్నట్టు తేలింది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు 24 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహారాష్ట్ర(MH), రాజస్తాన్(Rajasthan), గుజరాత్(Gujarath), గోవా(Gova), ఢిల్లీ(Delhi) రాష్ట్రాలకు పంపించింది. దాదాపు మూడు నెలలపాటు ఆయా రాష్ట్రాల్లో ఆపరేషన్ కొనసాగించిన ఈ బృందాలు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లకు సహకరిస్తున్న 20మంది హవాలా వ్యాపారులను అరెస్ట్ చేశాయి. వీరి నుంచి ఆ కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 50కి చేరింది. పరారీలో మరికొందరు ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని ఈగల్ టీం అధికారులు తెలిపారు.
Also Read: Engineering Promotions: సీఎంవోకు చేరిన చీఫ్ ఇంజినీర్ వివాదం?
కొరియర్ సంస్థల ద్వారా..
మన దేశంలో డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్లు లాటిన్ అమెరికా నుంచి కొకైన్, క్రిస్టల్ మెత్, ఎక్టసీ పిల్స్, అంఫెటామైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ మాదక ద్రవ్యాలను ఫ్రాన్స్, బెల్జియం, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ నుంచి తెప్పిస్తున్నాయని ఈగల్ టీం అధికారులు తెలిపారు. డీహెచ్ఎల్(DHL), ఫెడెక్స్ కొరియర్(FedEx Courier) సంస్థల ద్వారా మాదక ద్రవ్యాల పార్సిళ్లు ఇక్కడికి చేరుతున్నాయని చెప్పారు. మొదట ఈ పార్సిళ్లు ముంబయి(Mumbai), ఢిల్లీ(Delhi) చేరుతాయని పేర్కొన్నారు. ఆ తరువాత డ్రగ్ పెడ్లర్లు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వీటిని స్మగుల్ చేసి అమ్ముతున్నారన్నారు.
Also Read: Communist Parties: పునాది పై కామ్రేడ్ల కసరత్తు.. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు