Engineering Promotions: గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన ప్రమోషన్లు, (Engineering Promotions) ఎఫ్ ఏసీ పోస్టింగ్ ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక అందజేసినట్లు తెలిసింది. సీనియారిటీ,రూల్ ఆఫ్ రిజర్వేషన్, పారదర్శకత ను పక్కకు పెట్టినట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సీఎంవోకు సబ్మిట్ చేసినట్లు తెలిసింది.
గత కొన్ని రోజులుగా ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలోని చీఫ్ ఇంజినీర్ నియామకం, (Engineering Promotions) పై వివాదం నెల కొన్నది. సీనియారిటీ లేకున్నా..ఆ పోస్టు (ఎఫ్ ఏసీ) ఇచ్చారని డి పార్ట్ మెంట్ లో చర్చ జరుగుతున్నది. దీనిపై నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న సీఎంవో..పూర్తి వివరాల రిపోర్టును సేకరించింది. ఆ నివేదికను స్పష్టంగా పరిశీలించిన ఉన్నతాధికారులు…సీఎస్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, జీఏడీ ఆఫీసర్లు అంశాన్నీ పూర్తి స్థాయిలో స్టడీ చేసి, తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు సెక్రటేరియట్ లో ఓ అధికారి తెలిపారు.
Also Read: Viral Video: రెస్టారెంట్‌లో సీటు లొల్లి.. ఘోరంగా కొట్టుకున్న.. హోటల్ స్టాఫ్, కస్టమర్లు!
ఆ నివేదికలో ఏమున్నది..?
గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగంలో నాలుగు ఈఈ పోస్టులు, రెండు ఎస్ ఈ పోస్టులు ఉన్నాయి. వీటిని సర్వీస్ రూల్స్ ప్రకారమే భర్తీ చేసినట్లు ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్టు ఇచ్చారు. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినెట్ సర్వీస్ రూల్ 33 , 36 ,సుప్రీం కోర్టు జడ్జిమెంట్ తేది 2003 ప్రకారమే సెలక్షన్స్ జరిగినట్లు పేర్కొన్నారు. ఆ రూల్ ప్రకారం పబ్లిక్ సర్వీస్ నుంచి సెలక్టైన వారి సీనియారిటీ మార్కుల ప్రాతిపాదికన ఆఫీసర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అదే విధానంలో పోస్టింగ్ లు ఇచ్చినట్లు చెప్పారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ 2004లో విడుదల చేసిన జీవో నెంబరు 2 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించాలంటే కేడర్ స్ట్రెంత్ 5 పోస్టుల కంటే ఎక్కువ ఉండాలని పేర్కొన్నారు.
దీని ప్రకారం గిరిజన సంక్షేమ శాఖలోఇంజినీరింగ్ శాలో ఈఈ పోస్టులు 4, ఎస్ ఈ పోస్టులు రెండు మాత్రమే ఉన్నాయి. కావున రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదని స్పష్టం చేశారు. సీఈతో కలిసి ఏడుగురు ఇంజినీర్లకు మెరిట్ ప్రకారమే సీనియారిటీని పరిగణలోకి తీసుకొని పోస్టులు ఇచ్చినట్లు అందజేశారు. అన్ని రాష్ట్ర స్థాయి పోస్టులే కావున ప్రాధాన్యత, ప్రాధాన్యత అనే చర్చ లేదని నివేదికలో స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 7న సీనియారిటీ లిస్టు పేపర్ వర్క్ మొదలు పెట్టి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి సుమారు 24 రోజుల సమయం పట్టిందని వివరించారు. ఆ తర్వాతనే బాధ్యతలు అప్పగించినట్లు ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులు రిపోర్టు లో పేర్కొన్నారు.
చీఫ్ ఇంజినీర్ లో సెలక్షన్ ఇలా..?
చీఫ్ ఇంజినీర్ పోస్టు కోసం 2025 జనవరిలో అప్పటి చీఫ్ ఇంజనీర్ శంకర్(Chief Engineer Shankar) ఆధ్వర్యంలో సిద్ధమైన జాబితాలో బాలు, ఫణికుమారి, జగజ్జ్యోతి, హేమలత వరుసగా నిలిచారు. అయితే జగజ్జ్యోతి అధికారిపై నమోదైన ఏసీబీ కేసుల కారణంగా ప్రమోషన్ నిలిచిపోగ సర్వీస్ రూల్స్ ప్రకారం క్లీన్ రికార్డు ఉన్నవారికే పదోన్నతి కల్పించినట్లు ఉన్నతాధికారులు వివరించారు. వారి నుంచి సీనియారిటీ ప్రకారం ఓ అధికారిని సీఈగా సెలక్ట్ చేసినట్లు వెల్లడించారు.
డీఈఈ కేడర్‌లో ఉన్న ఆర్‌డీ ఫణికుమారికి సీఈ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా, ఎ.హేమలతను సీఈ కార్యాలయంలో ఈఈ గా, జె.తానాజీని ఉట్నూరు ప్రాజెక్టులో ఈఈగా, సీహెచ్ సత్యనారాయణను భద్రాచలం ప్రాజెక్టులో ఈఈగా, కె.రామకృష్ణను ఏటూరునాగారం ప్రాజెక్టులో ఈఈగా నియమించగా, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) కేడర్‌లో ఉన్న కె.జగజ్యోతిపై ఏసీబీ కేసు ఉన్నందున గిరిజన గురుకుల సొసైటీలో పోస్టింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.