Uttam Kumar Reddy: ఆకాశమే సరిహద్దుగా అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆకాంక్షించారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని,మహిళా సాధికారతకు ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్న మహిళలు వేసే ప్రతి అడుగులోనూ రాష్ట్ర ప్రభుత్వం చేయూత నందిస్తుందని చెప్పారు. హైదరాబాద్(Hyderabad) మోహిదిపట్నం లోని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రాంగణంలో ఇన్క్యూబేసిన్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇన్క్యు బేసిన్ కేంద్రాలు ఆర్థిక వ్యవస్థలకు వెన్నుముఖగా నిలబడతాయన్నారు.
Also Read: Japanese woman: అంతరిక్షంలో చిక్కుకున్నా.. ఆక్సిజన్ కావాలంటూ.. డబ్బు దోచేసిన ఫేక్ వ్యోమగామి
ఇలాంటి కార్యక్రమాలు విద్యారంగం పరిశ్రమలతో కలిసి ఏర్పాటు చేస్తే కప్రపంచ స్థాయిలో వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు. ఈ ప్రక్రియలో మహిళలు అగ్రభాగాన ఉండాలన్నారు. జనాభాలో సగభాగంలో ఉన్న మహిళలు భాగస్వామ్యం లేకపోతే ఎంతో సామర్ధ్యాన్నీ కొల్పోయిన వారమవుతామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు సెయింట్ ఆన్స్ ప్రారంభించిన ఇన్క్యూబేసిన్ ఫౌండేషన్ మార్గదర్శనంగా మారనుందన్నారు.
హైదరాబాద్ నగరం విశిష్టమైనది
భారతదేశానికి యువత తరగని ఆస్తి అని అట్టి యువత అత్యున్నతులుగా ఎదగక పోతే నిష్ప్రయోజనంగా మారుతుందన్నారు. యువతను అత్యున్నతులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో మొట్ట మొదటిసారిగా వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రపంచంలోని నగరాలలో హైదరాబాద్ నగరం విశిష్టమైనదని అటువంటి హైదరాబాద్ ను గ్లోబల్ నగరంగా రూపాంతరం చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
Also Read: Drugs Seized: ఈ డ్రగ్ వాడితే.. డా.సమరంతో పనిలేదట.. నైజీరియన్ అరెస్ట్