Hyderabad (Image Source: free Pic)
హైదరాబాద్

Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్.. మహమ్మారులకు చెక్ పెట్టే.. ఎంఎస్‌యూ రెడీ!

Hyderabad: పెరుగుతున్న కల్తీ ఆహారం, యాంత్రిక జీవనం, వాతావరణంలోని మార్పుల కారణంగా ఆరోగ్యపరంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి, మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపే వైరస్ లను ముందుగానే కనుగొనేందుకు సిటీలో ఏర్పాటు చేయనున్న మెట్రోపాలిటన్ సర్వైలైన్స్ యూనిట్ (ఎంఎస్ యూ) ఏర్పాటు పనులు మరింత స్పీడప్ అయ్యాయి. కార్పొరేట్ వైద్యం ఖరీదు, సర్కారు వైద్యం నిర్లక్ష్యానికి మారుపేరుగా మారిన నేపథ్యంలో ఇకపై గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగానే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెట్రో పాలిటన్ సర్వైలెన్స్ యూనిటీ(ఎంఎస్ యూ) సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

రాబోయే అంటువ్యాధులపై పరిశోధనలు..
కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత వైరస్ లను కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్రం.. రాష్ట్రానికి మెట్రోపాలిటన్ సర్వైలైన్స్ యూనిట్ (ఎంఎస్ యూ) ను మంజూరు చేసిన సంగతి తెల్సింది. అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్ డీపీ) మున్ముందు ఆరోగ్యకరంగా తలెత్తే సమస్యలు పసిగట్టి, కొత్త కొత్త వైరస్ లను కనిపెట్టడంతో పాటు పర్యావరణం, మానవాళిపై వాటి ప్రభావం ఎంత వరకు ఉంటుంది? అన్న విషయాలపై కేంద్రం పరిశోధనలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కార్యక్రమాల్లో ఢిల్లీలో ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి నిపుణుల అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు సమాచారం.

23మంది సిబ్బంది నియామకం..
యూఎన్ డీపీ సిఫార్సు మేరకే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ యూ లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ హరిహరళాభవన్ లో ఎంఎస్ యూ ను ఏర్పాటు చేయటంతో పాటు నారాయణగూడ ఐపీఎం ఆవరణలోని రెండున్నర వేల చదరపు అడుగుల స్థలంలో అత్యాధునిక వైరల్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఒక వైపు వీటి ఏర్పాటు పనులతో పాటు ఈ ల్యాబ్ లో అవసరమైన 17 రకాల విధులు నిర్వర్తించే 23 మంది వెటర్నరీ, పశు సంవర్థక శాఖ, వైల్డ్ లైఫ్ తదితర విభాగాలకు చెందిన సిబ్బందిని నియమించనున్నారు.

ఈనెల 22న నోటిఫికేషన్..
ఇందుకు సంబంధించి నిమాయక నోటిఫికేషన్ ను ఈ నెల 22 వ తేదీ తర్వాత జారీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఇంటర్వ్యూ వంటి ప్రక్రియలను వచ్చే వారంలో నిర్వహించనున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్ మాన్ భారత్ స్కీమ్ లో భాగంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేస్తే నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా హైదరాబాద్ నగరంలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్(ఎంఎస్ యూ) ఏర్పాటుకు సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం.

నేషనల్ హెల్త్ మిషన్ తరపున..
రోజు రోజుకి జనాభా, పట్టణీకరణ పెరుగుతున్న హైదరాబాద్ మహా నగర వాసులకు మరింత అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎంఎస్ యూ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వివిధ రకాల వ్యాధులను గుర్తించడం, ప్రజలను అప్రమత్తం చేయటం, వ్యాధుల లక్షణాలను ధృవీకరించడం, నమూనా సేకరణ, విశ్లేషణకు ఈ యూనిట్ సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ తరపున దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్ పీ) కార్యక్రమంలో ఈ యూనిట్ భాగం కానున్నట్లు వెల్లడించారు. ఈ రెండు యూనిట్ లకు కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్లను జీహెచ్ఎంసీకి విడుదల చేసినట్లు సమాచారం.

ఢిల్లీలో ముగిసిన ఒక రోజు వర్క్ షాప్
కొత్త వైరస్ లను కనుగోవటంలో ప్రపంచు వ్యాప్తంగా అవసరమైన స్థాయిలో పరిశోధనలు జరగటం లేదన్న విషయాన్ని గుర్తించి, మహానగరాలను కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్రమత్తం చేస్తున్న యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్ డీపీ) ఢిల్లీలో వన్ హెల్త్ అంశం పేరిట ఒక రోజు వర్క్ షాప్ ను నిర్వహించింది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని మహానగరాలకు చెందిన స్థానిక సంస్థ అధికారులతో పాటు రాష్ట్ర పబ్లిక్ హెల్త్, వెటర్నరీ, పశు సంవర్థక శాఖ, వైల్డ్ లైఫ్ హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్ వంటి విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జీహెచ్ఎంసీ అదపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) సీఎన్ రఘుప్రసాద్, డీఎంఏ, నిలోఫర్ ఆస్పత్రి వైద్యలు, వైల్డ్ లైఫ్, ఇక్రిశాట్ వంటి సంస్థలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

300 లకు పెరగనున్న బస్తీ దవాఖానాలు
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లోని సుమారు కోటి 26 లక్షల మంది జనాభాకు 30 సర్కిళ్లలో దాదాపు 256 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. ఈ ఎంఎస్ యూ యూనిట్ అందుబాటులోకి వచ్చే లోపు బస్తీ దవాఖానాల సంఖ్య 300లకు పెంచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కొన్ని వైద్య పరీక్షలకు బస్తీ దవాఖానాల్లో కూడా శ్యాంపిల్స్ సేకరిస్తున్నప్పటికీ, రిపోర్టులు వచ్చే సరికి కాస్త సమయం పడుతున్నందున, త్వరలో అందుబాటులోకి రానున్న ట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ద్వారా వైద్య పరీక్షలను వీలైనంత త్వరితగతిన నిర్వహించి, రిపోర్టులు అందజేసే అవకాశామున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Kalvakuntla Kavitha: మళ్లీ ఓపెన్ అయిన కవిత.. కేసీఆర్, హరీశ్ రావుపై షాకింగ్ కామెంట్స్!

శాంపిల్స్ ఇస్తే చాలు
అయితే వైద్య పరీక్షలు అవసరమైన మహానగరవాసులు నేరుగా సికింద్రాబాద్, నారాయణగూడల్లో ఏర్పాటు చేయనున్న ట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ కు వచ్చే అవసరం లేకుండా, బస్తీ దవాఖానాల్లో శ్యాంపిల్స్ ఇస్తే చాలు, వారికి ఇరవై నాలుగు గంటల్లోనే వైద్య పరీక్షల రిపోర్టులు మళ్లీ బస్తీ దవాఖానాలకు వచ్చేలా ఈ యూనిట్ లు పని చేస్తాయని అధికారులు తెలిపారు. వివిధ బస్తీ దవాఖానాల నుంచి వచ్చే శ్యాంపిల్స్ ను బట్టి ఈ యూనిట్ పని చేస్తుందని, వీలైతే మున్ముందు ప్రజలకు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా సిబ్బందిని నియమించి, నిర్వహణ బాధ్యతలను చేపట్టేలా కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు సమాచారం.

Also Read: H-1B visa: ట్రంప్ మరో బాంబ్.. హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లు.. భారత్‌పై ప్రభావమెంత?

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?