Fake Cotton Seized(image credit:X)
హైదరాబాద్

Fake Cotton Seized: నకిలీ విత్తనాల గ్యాంగ్ పట్టివేత.. మరీ ఇంత మోసమా?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Fake Cotton Seized: తెలంగాణలో నిషేధించిన 75 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను మేడ్చల్ జోన్​ ఎస్వోటీ అధికారులు శామీర్​ పేట పోలీసులతో కలిసి పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. మేడ్చల్​ జోన్​ డీసీపీ ఎన్​.కోటిరెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల వాస్తవ్యుడైన సొల్లు సురేశ్​, వృత్తిరీత్యా డ్రైవర్​ అయిన సిరిమిల్ల నరేష్ ను కర్ణాటక రాష్ర్టం కుష్టగీ వెళ్లి రమణ అనే వ్యక్తి వద్దకు వెళ్లి అతను ఇచ్చే పత్తి విత్తనాలను తీసుకు రావాలని చెప్పాడు.

Also read: Betting Apps: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో.. రూ. 80 లక్షలు నష్టపోయిన బెట్టింగ్ బాధితుడు

ఈ పని చేసి పెడితే 50వేల రూపాయలు ఇస్తానన్నాడు. దీనికి అంగీకరించిన నరేష్​ తన సొంత డీసీఎం తీసుకుని కుష్టగీ వెళ్లాడు. అక్కడ రమణ కొద్దిసేపు వేచి ఉండమని నరేష్​ తో చెప్పి డీసీఎం తీసుకుని వెళ్లాడు. ఆ తరువాత మన రాష్ట్రంలో నిషేధించిన బీజీ 3 రకానికి చెందిన 3,750 కిలోల పత్తి విత్తనాలను డీసీఎం వ్యాన్​ లో లోడ్​ చేసి నరేష్​ కు ఇచ్చాడు. అక్కడి నుంచి బయల్దేరిన నరేష్​ మంచిర్యాలకు బయల్దేరాడు.

Also read: Kaloji Narayana Rao University: ఫలించిన ‘స్వేచ్ఛ’ కృషి .. వీసీని మార్చిన ప్రభుత్వం

బుధవారం రాత్రి ఓఆర్​ఆర్ నుంచి తూముకుంట గ్రామానికి వెళ్లే రోడ్డులోకి రాగానే మేడ్చల్ జోన్ ఎస్వోటీ అధికారులు శామీర్​ పేట పోలీసులతో కలిసి డీసీఎం వ్యాన్ ను పట్టుకున్నారు. నరేష్​ ను అరెస్ట్​ చేశారు. మొత్తం 150 బ్యాగుల్లో ఉన్న పత్తి విత్తనాలను సీజ్​ చేశారు. పరారీలో ఉన్న సురేశ్​, రమణల కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నరేష్ పై శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్వోటీ డీసీపీ డీ.శ్రీనివాస్​, అదనపు డీసీపీ విశ్వప్రసాద్​ ల పర్యవేక్షణలో పేట్​ బషీరాబాద్​ ఏసీపీ కే.రాములు, సీఐలు శ్యాంసుందర్​ రెడ్డి, శ్రీనాథ్​ తదితరులు దాడిలో పాల్గొన్నారు.

స్వేచ్ఛ E -పేపర్ కోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం