Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతం ఇప్పుడు టాలీవుడ్‌కు నిద్రలేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు ఈ యాప్స్ ప్రమోట్ చేయని వారు హాయిగా నిద్రపోవచ్చు కానీ, గతంలో ఎప్పుడైనా ఈ యాప్స్ ప్రమోట్ చేసి ఉంటే మాత్రం, వారు అడ్డంగా బుక్కయినట్టే. అందుకు ఉదాహరణ రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వంటి వారే. అప్పుడెప్పుడో వీరు ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు, ఇప్పుడు వారిపై కేసు నమోదైంది. అప్పుడు వారు ప్రమోట్ చేసిన యాప్స్‌కు ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఇప్పటి వరకు ఈ యాప్స్ ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను, యూబ్యూటర్స్‌ను, సెలబ్రిటీలను పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటకు వస్తుండటం విశేషం.
Also Read- Gautham Ghattamaneni: గౌతమ్ యాక్టింగ్ ఇరగదీశాడు.. ఇంకో వారసుడు రెడీ!
ఇదిలా ఉంటే.. నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna), ఆహా ఓటీటీ (Aha OTT) కోసం చేస్తున్న అన్‌స్టాపబుల్ షో చూసి, ఓ వ్యక్తి బెట్టింగ్‌కు పాల్పడినట్లుగా చెప్పడంతో.. పోలీసులు వారి దృష్టిని ఇలాంటి షోలపై కూడా పెట్టారు. ఆహాలో అన్‌స్టాపబుల్ మాత్రమే కాదు, మరికొన్ని షోలను కూడా బెట్టింగ్ యాప్స్ కొన్ని సమర్పిస్తున్నాయి. షో మధ్యలో ఈ యాప్స్‌ని యాంకర్స్, హోస్ట్‌లు ప్రమోట్ చేస్తున్నారు. ఓంకార్ వంటి వారు చేస్తున్న డ్యాన్స్ ఐకాన్ షో లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తుండటం గమనించవచ్చు. ప్రక్షాళన అంటూ మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి వాటన్నింటనీ పోలీసులు పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో వచ్చే ఒక ప్రకటన చూసి బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టాను : బెట్టింగ్ బాధితుడు
బంగారం తాకట్టు పెట్టి, అప్పు తెచ్చి రూ.80 లక్షలు బెట్టింగ్ లో పెడితే మొత్తం నష్టపోయాను
మొదట్లో మనకు లాభాలు చూపి ఆ తర్వాత వాళ్ల ఊబిలోకి లాగుతారు
కొన్ని రోజుల తర్వాత… pic.twitter.com/dq9eJ92IcX
— BIG TV Breaking News (@bigtvtelugu) March 21, 2025
ఇక విషయంలోకి వస్తే.. నెల్లూరుకు చెందిన రాంబాబు అనే బెట్టింగ్ బాధితుడు.. బాలయ్య అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె (Unstoppable With NBK) ని టార్గెట్ చేస్తూ.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో లో వచ్చే ఒక ప్రకటన చూసి బెట్టింగ్ పెట్టడం స్టార్ చేసినట్లుగా సదరు బెట్టింగ్ బాధితుడు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనకి ఇదొక వ్యసనంగా మారిందని, ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం అన్ని తాకట్టు పెట్టి దాదాపు రూ. 80 లక్షలు నష్టపోయినట్లుగా షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
Also Read- CPI Narayana: మెగాస్టార్ చిరంజీవినే భయపెట్టా.. మీరెంత?.. అంటూ నారాయణ వార్నింగ్
రాంబాబు మాట్లాడుతూ.. ‘‘నాకు అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తెలియదు. బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో వచ్చిన ఒక ప్రకటన చూసి బెట్టింగ్‌కు అలవాటు పడ్డాను. ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టి, అప్పు తెచ్చి.. మొత్తంగా రూ. 80 లక్షలు బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయాను. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్లు మొదట్లో మనకు లాభాలు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత అసలు ఊబిలోకి లాగుతారు. అప్పటికే మనం ఈ వ్యసనానికి అలవాటు పడిపోతాం. ముందు కొంత వచ్చిన అనుభవం ఉండటంతో.. నష్టం వచ్చినా, మళ్లీ లాభాలు వస్తాయని ఆశపడుతూ ఇంకా ఇంకా పెడుతూనే ఉంటాం. నేను అలా రూ. 80 లక్షలు నష్టపోయి, చివరికి ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లాను. బెట్టింగ్ ప్రమోటర్లు, బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. నాలాంటి వారెందరో ఈ భూతానికి బలవుతున్నారు. యువత ఈ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి’’ అని ఈ మహమ్మారి ఎలా జీవితాలను నాశనం చేస్తుందో తెలిపాడు. ప్రస్తుతం ఆయన బెట్టింగ్స్ గురించి చెబుతున్న ఈ వీడియో వైరల్ అవుతుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు