Medchal Govt Lands(IMAGE CREDIT: TWITTER)
హైదరాబాద్

Medchal Govt Lands: గతంలోనే పలుచోట్ల.. భూముల లెక్క తేల్చిన అధికారులు!

Medchal Govt Lands: మేడ్చల్‌ జిల్లాకు ఇటీవల కలెక్టర్‌గా వచ్చిన మిక్కిలినేని మను చౌదరికి భూ సమస్యలు సవాల్‌గా మారాయి. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున సర్కార్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఇంకా ఆక్రమణల పర్వం జోరుగా సాగుతున్నది. దీంతో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కొత్త కలెక్టర్‌ (Collector) ప్రభుత్వ ఆక్రమణలపై నజర్‌ పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే  రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అధికారులు అక్కడక్కడా భూముల లెక్కలను తేల్చారు. ఆ ఆక్రమణలపై తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టర్‌ (Collector) కఠినంగా వ్యవహరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

కబ్జాకు కాదేదీ అనర్హం
హైదరాబాద్ నగరంతో పోటీపడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న (Medchal) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో భూములకు రూ.కోట్లలో ధర పలుకుతున్నది. రోజురోజుకూ భూ విలువ పెరుగుతుండడంతో అక్రమార్కుల కన్ను (Government lands) ప్రభుత్వ భూములపై పడింది. సరైన పర్యవేక్షణ లేక ఇప్పటికే వేల ఎకరాల్లో భూములు ఆక్రమణలకు గురికాగా, ఇంకా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు, అసైన్డ్, దేవాదాయ, భూదాన్‌, పోరంబోకు, అటవీ భూముల్లో కబ్జా కాండను సాగిస్తున్నారు. కాగా, ఆక్రమణల వెనుక కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారని, మరికొన్ని చోట్ల కొందరు రెవెన్యూ అధికారుల అండదండలతో భూ దందాలు జరుగుతున్నట్లు సమాచారం.

మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ అయిన చోట్ల జీపీ పర్మిషన్లతో అక్రమ దందా నడిపిస్తున్నారు. జవహర్‌‌నగర్‌లోని సర్వే నెంబర్ 613, 614, 510, 432, 495 తదితర వాటిల్లోని (Government lands) ప్రభుత్వ భూములు కబ్జాకు గురై నిర్మాణాలు కూడా వెలిశాయి. కబ్జాదారులు నోటరీలపై స్థలాల క్రయవిక్రయాలు జరుపుతూ వస్తున్నారు. గతంలో మిలటరీ అవసరాల కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోగా, అందులో కొంత జవహర్‌నగర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి, మరో 2,370 ఎకరాలను  (HMDA)హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం దశలవారీగా కేటాయించింది. ఈ స్థలాలు కూడా చాలావరకు కబ్జా అయ్యాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ లెక్కలను తేల్చడంలో భాగంగా, కొంతకాలం క్రితం ఇక్కడ సర్వే జరిపిన అధికారులు రూ.వేల కోట్ల విలువైన 975 ఎకరాలు అక్రమార్కుల చెరలో ఉన్నాయని తేల్చినట్లు తెలిసింది.

 Also Read: Gonne Prakash Rao: మూడోసారి అధికారం కోసమే ఇదంతా.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి!

1,531 ఎకరాలు

జిల్లాలో 1,620 ఎకరాల విస్తీర్ణంలో దేవాదాయ భూములు ఉండగా, అత్యధికంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్‌లోనే 1,531 ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి. సర్వే నెంబర్ 55 నుంచి 63 వరకు, 639-641, 656-657, 660-682, 686-718, 736 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని దేవాదాయ భూమిగా గతంలోనే గుర్తించారు. అయితే, ప్రస్తుతం ఈ భూముల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు వెలిశాయి. కొందరు వీటిని అద్దెకు సైతం ఇచ్చారు. ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు (Revenue Officers) 221 వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిసింది. కబ్జా చేసిన వారి వివరాలతో సమగ్ర నివేదికను కూడా రూపొందించినట్లు తెలిసింది.

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి : జిల్లా కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరి
జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమణల నుంచి పరిరక్షించాలని (Medchal)మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి తహశీల్దార్లకు సూచించారు.  (Collector) కలెక్టరేట్‌‌లో భూ సమస్యలపై జిల్లా అదనపు (Collector) కలెక్టర్ విజయేందర్‌‌రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు.

మండలాల వారీగా భూ సమస్యలపై వివరంగా తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా (Government lands)  ప్రభుత్వ భూముల వివాదాలు, ఆక్రమణలకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై తహశీల్దార్లతో చర్చించారు. భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలను, సూచనలను ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌‌కు వివరించారు.

Also Read: Agricultural Workers: 4 నెలలుగా ఎదురు చూస్తున్న ఉపాధి కూలీలు

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ