Agricultural Workers: రైతు భరోసాకు (Farmer Assurance) ఉపాధి కూలీలు ఎదురు చూస్తున్నారు. ఆసరాగా ఉంటుందని ఆశించినప్పటికీ నిరాశే ఎదురవుతుంది. ప్రభుత్వం ప్రతి కూలీకి ఏటా 12వేలు ఇస్తామని ప్రకటించింది. కానీ, కొందరికి మాత్రమే ఇచ్చింది. మిగతా వారు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 5.19లక్షల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. బడ్జెట్లో 600కోట్లు కేటాయించారు. కానీ, కొంత మందికి టోకెన్లు సైతం జారీ చేసినా కూలీల ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
ఒక్కో సీజన్‌కు రూ.311 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం(Government) ప్రకటించినా, నిధుల విడుదల జాప్యంతో కూలీలకు ఇక్కట్లు తప్పడం లేదు. తెలంగాణలోని భూమిలేని నిరుపేద ఉపాధి కూలీలకు ఆర్థికసాయం అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం (Government) ప్రకటించింది. అందుకు (Government) ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ (Indiramma spiritual assurance) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 26న ప్రభుత్వం (Government) ప్రారంభించిన ఈ పథకం నిధుల కొరతతో ముందుకు సాగడం లేదు. 2023-24లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 రోజులు పనిచేసిన సొంత భూమిలేని కూలీలకు రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.12 వేలు అందించనున్నట్లు ప్రభుత్వం (Government) పేర్కొంది.
Also Read: CM Revanth Reddy: వివాదం తెంచేందుకు.. నాలుగు రోజులైన సరే!
అంతేకాదు ప్రభుత్వం (Government) పథకానికి సంబంధించిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా ఒక్కో జిల్లాలోని ఒక గ్రామాన్ని మాత్రమే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ ఏడాది జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లోని 18,180 మందికి రూ.6 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఆ తరువాత శాసనమండలి ఎన్నికల నోటిఫికేషన్ రాకవడంతో పథకం తాత్కాలికంగా వాయిదా పడింది. కోడ్ ముగిసిన తర్వాత మరో 63 వేల మందికి నగదు జమచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత నుంచి నిధులు ఖాతాల్లో జమకాలేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 3,217 గ్రామాల్లో కేవలం 83,887 మందికి మాత్రమే రూ.50.33 కోట్లు కూలీల్లో ఖాతాల్లో జమ అయ్యాయి.
5,19,191 మందిని అర్హులుగా గుర్తించి
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 48,13,966 జాబ్‌కార్డులు ఉండగా, ఇందులో 93,61,614 మంది కూలీలుగా నమోదయ్యారు. ఉపాధి హామీలో 20 రోజులు పనిచేసినవారు 38,02,209 మంది ఉన్నారు. ఇందులో 20 రోజులు పనిచేసినవారిలో రైతు భరోసా లబ్ధిదారులు 15,39,812 మంది ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma spiritual assurance) కింద 5,19,191 మందిని అర్హులుగా గుర్తించింది. గ్రామసభల ద్వారా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
అంతేకాదు జాబితాల్లో పేర్లు లేని అర్హులైన కూలీలు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించడంతో మరో 2.24 లక్షల వరకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో కేవలం 19,193 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. 59,542 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మరో 1,44,784 దరఖాస్తులను తిరస్కరించారు. అనేక ఆంక్షలు, కోతలు విధించగా మొత్తం 5,19,191 లక్షల మందితోపాటు కొత్త దరఖాస్తుదారులు మరో 26 వేల వరకు ఉంటారని అధికారులు అంచనా. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను (Indiramma spiritual assurance) అందజేయాల్సి ఉంటుంది.
4 నెలలుగా బిల్లులు పెండింగ్
రాష్ట్రంలోని అర్హులైన 6 లక్షల మందికి ఆత్మీయ భరోసా కింద ఆర్థిక భరోసా ఇవ్వాలంటే ఒక్క సీజన్‌కు రూ.311 కోట్లు అవసరం కానున్నాయి. బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.600 కోట్లు మాత్రమే కేటాయించినా, తొలివిడతలో ఇప్పటివరకు రూ.50.33 కోట్లు మాత్రమే అర్హులకు అందజేశారు. ఇంకా 4,35,304 మందికి రూ.261 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపగా అధికారులు టోకెన్లు జారీచేశారు. కానీ, సుమారు 4 నెలలుగా బిల్లులు విడుదల కావడం లేదని సమాచారం.
ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు మంత్రి సీతక్క (Seethakka) చొరవ చూపి తమ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కాగా, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధి కూలీలు గ్రామాల్లో ఎక్కువ మంది ఉండటంతో వారి ప్రభావం పార్టీపై పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పథకం అయినప్పటికీ నిధుల కొరత వెంటాడుతున్నది. అంతేగాకుండా ఈ భరోసా పథకం విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పథకం నిధులు మంజూరు చేయాలని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు.