CM Revanth Reddy(inage credit: twitter)
Politics

CM Revanth Reddy: వివాదం తెంచేందుకు.. నాలుగు రోజులైన సరే!

CM Revanth Reddy: బనకచర్ల వివాదాన్ని తెంచేందుకు నాలుగు రోజుల పాటు చర్చించేందుకు తాను రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.  ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏపీ సీఎంతో తాను చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి (Revanth Reddy) క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌తో చర్చించేందుకు తామే ఒక అడుగు ముందుకు వేస్తామన్నారు. ఈ నెల 23న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంటుందని వెల్లడించారు. బనకచర్ల అంశమే ప్రధాన అజెండాగా ఉంటుందన్నారు. (Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్‌తో తాము వివాదాలు కోరుకోవడం లేదన్నారు.

అదే సమయంలో ఎవరి కోసమో తమ హక్కులను వదులుకోమన్నారు. చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రావద్దనే, కాంగ్రెస్ పార్టీ (Congress party) తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే, మొదట తెలంగాణకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. కానీ, ఏపీ ప్రాజెక్టుల అనుమతుల కోసం కేంద్రం వద్దకు వెళ్తుందన్నారు. కేంద్రం సైతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  నిర్మించనున్న ప్రాజెక్టులపై సమావేశాలు నిర్వహించడం విచిత్రంగా ఉన్నదన్నారు. తెలంగాణకు సంబంధం లేకుండా రివ్యూస్ పెట్టడం ఏమిటని? సీఎం మండిపడ్డారు.

 Also Read: Iran Israel Conflict: ఇరాన్‌కు భారత్ ప్రత్యేక విజ్ఞప్తి.. వెంటనే అంగీకారం

దీంతోనే తెలంగాణ ఆందోళన పడాల్సి వస్తుందన్నారు.  (Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్‌తో ఇప్పుడు అసలైన సమస్య మొదలైందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ఫిజిబిలిటీ రిపోర్ట్‌ను మొదట కేంద్రానికి కాకుండా తెలంగాణకు ఇచ్చి ఉంటే ఎలాంటి గొడవలు జరిగేవి కావన్నారు. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన తమకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని సీఎం వివరించారు. తెలంగాణతో దిగువ, ఎగువ రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయని, అందరితోనూ కలిసి మంచి సాంప్రదాయంతో ముందుకు సాగుతామని సీఎం వెల్లడించారు.

పునరుజ్జీవం కోసం బీఆర్‌ఎస్ తాపత్రాయం
ఒకవేళ‌ పై రాష్ట్రాలతో సమస్య ఉంటే  (Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్‌తో కలిసి మాట్లాడాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందన్నారు. ఏపీతో తాము మొదటి నుంచి వివాదం కోరుకోలేదన్నారు. బనకచర్లకు పునాది పడిందే కేసీఆర్ (KCR) హయంలో అంటూ ప్రకటించారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో సెంటిమెంటును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ (BRS) ఇంతకాలం బతికిందని, ఇక బీఆర్‌ఎస్ రాజకీయంగా చచ్చిపోయిందన్నారు. ఇప్పుడు జలాలు ఆధారంగా పునరుజ్జీవనం కోసం బీఆర్‌ఎస్ (BRS) పాకులాడుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్గాన్ డోనేట్ చేసి బీఆర్‌ఎస్ (BRS) బీజేపీని(BJP) బతికించిందన్నారు. మెదక్ లాంటి బీఆర్‌ఎస్ కోర్ ఏరియాల్లోనూ సీటు గెలవలేదంటేనే అర్ధం చేసుకోవచ్చని గుర్తు చేశారు. ఇప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) కేటీఆర్ ట్యూటర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పొడవుకు జ్ఞానానికి సంబంధం లేదు
ఇక పొడుగ్గా పెరిగినంత మాత్రాన తెలివి ఉందనుకోవడం సరికాదని మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao)పై సీఎం కామెంట్ చేశారు. జ్ఞానానికి పొడవుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్ (BRS) నాయకులు తనను విమర్శిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కుర్చీలో తాను కుర్చుంటే ఓర్వలేకపోతున్నారని వెల్లడించారు. 2016లోనే బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) కోసం పునాదిరాయి పడిందనే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలన్నారు.

విచారణ ముగిసిన తర్వాత చర్యలు
(Phone Tapping) ఫోన్ ట్యాపింగ్‌పై విచారణలు జరుగుతున్నాయని, ఈ తప్పిదాలకు పాల్పడిన ఎంత పెద్ద వ్యక్తులునైనా వదిలేది లేదని సీఎం నొక్కి చెప్పారు. సంపూర్ణంగా విచారించాలని తానే ఆదేశించినట్లు సీఎం చెప్పారు. ఇప్పటికే చాలా మంది ఆధారాలు ఇచ్చారని, త్వరలో మరి కొంత మందిపై కూడా ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)  విచారణ జరుగుతుందని సీఎం వెల్లడించారు. కేసును పక్కదోవ పట్టించే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు. బీఆర్ఎస్(BRS) అత్యుత్సాహం వల్ల చాలా మంది లీడర్లు నష్టపోయారన్నారు. ఇందులో కీలక అధికారులు కూడా ఉండడం విచిత్రంగా అనిపించిందన్నారు.

 Also Read:CM Revanth Reddy: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌ 2 మంజూరు చేయండి!

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?