CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు (Manohar Lal Khattar) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రిక్వెస్ట్ చేశారు. ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ (Hyderabad) నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 (Metro Phase2) అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
Also Read: Electricity Department: రెగ్యులర్ ఉద్యోగులకు ఒక రూల్ ఆర్టీజన్లకు ఒక రూలా?
మెట్రో ఫేజ్ 2 (Metro Phase2) సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్ట్ డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్రమంత్రికి గుర్తు చేశారు. హైదరాబాద్ (Hyderabad) మెట్రో ఫేజ్ 2 (Metro Phase 2) ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, (UTTAM Kumar Reddy) ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, Jithendher Reddy) మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, (NVS Reddy) కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: రాష్ట్ర ప్రయోజనాలకు.. విరుద్ధంగా ప్రాజెక్ట్ ప్రతిపాదన!