Aghori on Sri Varshini: తెలుగు రాష్ట్రాల్లో వివాదస్పదంగా మారిన అఘోరీ (Lady Aghori)ని హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డబ్బు తీసుకొని ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీ, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అరెస్ట్ చేసినా పోలీసులు.. తాజాగా హైదరాబాద్ తీసుకొచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రిమాండ్ విధించే ఛాన్స్
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఇటీవల అఘోరీపై మోకిలా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో తన వద్ద రూ.9.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన మోకీలా పోలీసులు.. అఘోరీని అరెస్ట్ చేసిన నగరానికి తీసుకొచ్చారు. ఏసీపీ ఆధ్వర్యంలో అఘోరీని విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అఘోరీ మోసాల పట్ల ఇపప్టికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలో.. ఆమెకు రిమాండ్ విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
జైలుకు శ్రీవర్షిణి!
నార్సింగి పోలీసు స్టేషన్ (Narsingi Police Station) కు చేరుకున్న అఘోరీతో మీడియా ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం చేశారు. అరెస్ట్ అయిన నేపథ్యంలో నిన్ను నమ్ముకొని వచ్చిన శ్రీవర్షిణి (Sri Varshini) పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇందుకు అఘోరీ బదులిస్తూ తన భార్య తనతో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే మీతో పాటు జైలుకు వస్తుందా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ‘ఆ.. వస్తది.. వస్తది’ అంటూ అఘోరీ సమాధానం ఇచ్చింది.
Also Read: Visakha Man Died In Attack: మొక్కలకు నీళ్లు పోసి.. కాశ్మీర్ దాడిలో ప్రాణం వదిలి.. విశాఖలో విషాదం
శ్రీవర్షిణి ఏం చేస్తుంది?
ఇటీవలే అఘోరీని శ్రీవర్షిణి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై తన జీవితం అఘోరీతోనేనన్న ఆమె.. తమ జోలికి ఎవరు రావద్దని హెచ్చరించింది. వస్తే పెట్రోల్ పోసుకొని మరీ చనిపోతామని ఇద్దరూ వార్నింగ్ ఇచ్చారు. అయితే అఘోరీని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో శ్రీవర్షిణిని పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. ఆమె తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తుందా? లేదా అఘోరీ కోసం న్యాయ పోరాటానికి దిగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.