Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులనే టార్గెట్ చేస్తూ దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం హాస్పిటల్ కి తరలించారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్ రంజన్ కూడా ఉన్నారు. ఆయన భార్య సురక్షితంగా ఉండగా .. వారి పిల్లలు మాత్రం మృతి చెందారు.
కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే స్పందించేందుకు, ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో తెలంగాణకు చెందిన మృతులను, గాయపడ్డవారని, గల్లంతైనవారిని కానీ, ఇంత వరకు ఎవ్వరూ గుర్తించలేదు. అయినప్పటికీ, ఏవైనా సమాచారం అందినట్లయితే వెంటనే, స్పందించేందుకు ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించి సమాచారం పొందవచ్చు:
శ్రీమతి వందన:9871999044.
శ్రీ హైదర్ అలీ నఖ్వీ: 9971387500.
Also Read: Southern DPGs Meeting: సైబర్ నేరాల నివారణ కోసం.. దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు ప్రత్యేక సమావేశం!
ఈ ఘటనపై తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు జమ్మూ & కశ్మీర్ ప్రభుత్వం తో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పౌర సంబంధాల అధికారి,తెలంగాణ సమాచార కేంద్రం,న్యూ ఢిల్లీ చే జారీ చేయబడినది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు