Hydraa: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై సిటీల్లోని సర్కారు భూములను పరిరక్షిస్తున్న హైడ్రా(Hydraa) ఇపుడు ఆ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేయనంది. సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర స్థలాలు కబ్జాకు గురైతే సామాన్యులు సైతం ఫిర్యాదులు చేసేలా టోల్ ఫ్రీ నెంబర్ 1070 ను మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. కబ్జాలు, ఆక్రమలకు సంబంధించిన సమాచారముంటే టోల్ ఫ్రీ నెంబర్ 1070 నంబరుకు ఫోను చేసి ఫిర్యాదులు చేయవచ్చునని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ ద్వారా సమాచారాన్ని అందించవచ్చునని తెలిపారు.
కేవలం ఆక్రమణలు, కబ్జాలే గాక, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, చెట్లు పడిపోయినా, వరద ముంచెత్తినా, అగ్ని ప్రమాదాలు జరిగినా ఇలా ఎలాంటి విపత్తులు సంభవించినా, హైడ్రా(Hydraa)కు సంబంధించిన సేవలన్నిటికోసం టోల్ ఫ్రీ నంబరు 1070 ద్వారా సంప్రదించవచ్చునని కమిషనర్ సూచించారు.
Also Read: Jubilee Hills By election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై తాజా అప్‌డేట్ ఇదే!
అందుబాటులో మరిన్ని సెల్ నెంబర్లు
ఓఆర్ఆర్ పరిధిలో ప్రభుత్వ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు 8712406899 నంబరుకు సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాప్(WhatsApp) ద్వారా ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపించవచ్చునని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. దీనికి తోడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, భారీ వర్షాలు పడి కాలనీలు, రహదారులు నీట మునిగినా, అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే 8712406901, 9000113667 ఫోన్ నెంబర్లకు ఫోను చేయాలని హైడ్రా కోరింది. 1070 టోల్ ఫ్రీ నంబరుతో పాటు పైన పేర్కొన్న మూడు సెల్ నంబర్లను ప్రజలు వినియోగించుకోవాలని హైడ్రా కమిషనర్ సూచించారు.
Also Read: HYDRA Prajavani: హైడ్రా ప్రజావాణి.. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా?