Hydraa: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలోని ముష్కిన్ చెరువు(Mushkin Pond) పరిరక్షణకు హైడా(Hydraa) చర్యలు మొదలుపెట్టింది. ఎఫ్‌టీఎల్(FTL) పరిధిలో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) ఆదేశించారు. ఆగస్టు నెలాఖరుకు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో వేసిన మట్టితో పాటు పై భాగంలో వేసిన బండ్‌ను తొలగించాలన్నారు. లేని పక్షంలో బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
తత్వ రియల్ ఎస్టేట్ సంస్థ
అభివృద్ధి పేరిట చెరువు ఎఫ్‌టీఎల్(FTL)లో బండ్ నిర్మించి, పై భాగాన్ని చెరువు నుంచి బండ్ ద్వారా వేరు చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయటంతో హైడ్రా(Hydraa) శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణలో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు హైడ్రా సమావేశాన్ని నిర్వహించింది. సీఎస్ఆర్(CSR) నిధులతో చెరువును అభివృద్ధి చేస్తున్న తత్వ రియల్ ఎస్టేట్ సంస్థ(Tatva Real Estate Company)తో పాటు ఆ పనులు చేపట్టిన ద్రవాన్ష్(Dhravansh) అనే ఎన్జీఓ సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్ యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుంది
వాదనలు విన్న తర్వాత అభివృద్ధి
చెరువు విస్తీర్ణం మొత్తం 50 ఎకరాల వరకూ ఉండగా, చెరువు చుట్టూ ఎగువ భాగంలో కూడా బండ్ నిర్మించడంతో కేవలం 12 ఎకరాలకు పరిమితం చేసినట్టు అవుతోందని నివాసితులు, ముష్కి చెరువు(Mushkin Pond) పరిరక్షణ సమితి ప్రతినిధులు హైడ్రా(Hydraa) ముందు వాపోయారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు వ్యతిరేకంగా చెరువులో మట్టి పోయడం పట్ల హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మట్టిని తొలగించి పూర్తి స్థాయిలో చెరువును కాపాడి అభివృద్ధి పనులు కొనసాగించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు
Also Read: Mallikarjuna Kharge: తెలంగాణలో కులగణన దేశానికి దిశానిర్దేశం!