Ramchander Rao: కార్యకర్తలు, నాయకుల మధ్య మనస్పర్థలు ఉంటే తర్వాత చూసుకుందామని, కొత్త, పాత బేధాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchender Rao) పిలుపునిచ్చారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ తల్లిలాంటిదని, ఈ తల్లికి నాయకులు, కార్యకర్తలు ద్రోహం చేయకూడదని కోరారు. కాంగ్రెస్(Congress) నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని రాంచందర్ రావు విమర్శలు చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన మండిపడ్డారు.
బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోవడం
కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్, ఎరువుల డీలర్లపై సరైన మానిటరింగ్ లేకపోవడం, సరఫరా వ్యవస్థపై రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యానికి నిదర్శనమని రాంచందర్ రావు(Ramchander Rao) తెలిపారు. యూరియా బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన వివరించారు. గతం కన్నా ఎక్కువగా 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం అందించినా వాటిని రైతులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రైతాంగానికి అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ప్రత్యేక కథనంతో.. ఎట్టకేలకు ఆస్పత్రి వైద్య సేవలకు మోక్షం..
కాటన్ సీడ్ బౌల్
ఇదిలా ఉండగా మహబూబ్ నగర్(Mehabubnagar) జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ(BJP)లో పెద్దఎత్తున చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ ప్రాంతం కాటన్(Coton) సీడ్ బౌల్‌గా పేరుగాంచిందని కొనియాడారు. కానీ అలాంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది కాంగ్రెస్(Congress) నాయకులు ఫెర్టిలైజర్ షాపులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్నారని విమర్శలు చేశారు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!