Mahabubabad Crime: ఆస్తి వివాదం నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం ఒక దారుణం చోటుచేసుకుంది. సొంత బావను బామ్మర్ది హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య(CI Sarvayya) వెల్లడించారు. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కొనుగొండ చెన్నయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారందరికీ వివాహాలై, ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు.
ఆస్తి పంపకాలలో వ్యతిరేకంగా
అయితే, చెన్నయ్యకు సంబంధించిన 15 ఎకరాల ఉమ్మడి ఆస్తి ఉంది. ముగ్గురు కూతుళ్లకు వివాహం చేసిన సమయంలో కట్నం ఇచ్చి పంపించినప్పటికీ, చెన్నయ్య, అతని భార్య ఉమ్మడి ఆస్తి(Joint property)ని కుమారుడు కొనుగొండ మల్లేశ్(Mallesh)తో సమానంగా కూతుళ్లకు కూడా పంచాలని ఆలోచించారు. ఈ నేపథ్యంలో, పెద్ద కూతురు కోమల భర్త కంకల ఉప్పలయ్య(Uppalaiah) అదే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తన పెద్ద అక్క భర్త ఉప్పలయ్య ఆస్తి పంపకాలలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని కొనుగొండ మల్లేశ్ కక్ష పెంచుకున్నాడు.
Also Read: Vivek Venkataswamy: రాష్ట్రంలో 20 లక్షల నూతన రేషన్ కార్డుల పంపిణీ లక్ష్యం
ఇదే సరైన సమయంగా భావించి
బుధవారంరోజున కంకల ఉప్పలయ్య తన గొర్రెలను మేపడానికి అడవికి వెళ్ళాడు. అయితే ఇదే అదనుగా భావించిన కొనుగొండ మల్లేశ్, ఇనుప రాడ్డు(Iron rod)తో ఉప్పలయ్యను వెనుక నుంచి దారుణంగా కొట్టి హత్య చేసి చంపేసాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ ఎన్. తిరుపతిరావు(DSP Tirupati Rao) ఆధ్వర్యంలో రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం ఎస్సై మురళీధర్(SI Muralidhar) రాజులు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. హంతకుడు మల్లేష్‌పై కేసు నమోదు చేసి పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్ యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుంది