Vivek Venkataswamy: రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల నూతన రేషన్ కార్డులు ఇచ్చే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మెదక్(Medak) జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో నియోజక వర్గానికి సంబంధించి రేషన్ కార్డు ల మంజూరి ప్రొసీడింగ్స్ ను సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) తో కలసి లబ్ధి దారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పథకాలను పొందేందుకు హార్హత పొందుతారని చెప్పారు.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇచ్చిన హామీలను ప్రజాపాలన ద్వారా నెరవేరుస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు, అర్ టి సి బస్సులలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంపు, రైతు భరోసా, సన్నరకం వడ్లకు 500 రూపాయల బోనస్, తదితర కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునీ అమలు చేస్తుందని అన్నారు.
Also Read: BRS KTR: నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆదేశాలు
జిల్లా అభివృద్ధికి మంత్రి సహకరించాలి: హరీష్ రావు
సిద్దిపేట జిల్లా(Siddipet District) అభివృద్ధికి మంత్రి సహకరించాలనీ హరీష్ రావు(Harish Rao) కోరారు. కొత్త రేషన్ కార్డుల(New ration cards)ను పొందిన వారికి ఈ నెల నుంచే సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో నూకలు ఎక్కువగా ఉండి అన్నం ముద్దగా అవుతుందని ఆరోపణలు వస్తున్నాయని నాణ్యమైన బియ్యం, సరఫరా చేసేలా ప్రభుత్వం పర్యవేక్షించాలని హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి(Yadava Reddy) దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి(Prabakar Reddy) రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ హైమావతి అదనపు కలెక్టర్లు అగర్వాల్ అబ్దుల్ హమీద్ జిల్లా పౌరసరఫరా అధికారి తనుజ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం
జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులతో సిద్దిపేట కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. మాజీ మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
Also Read: Viral Video: గుద్దితే.. బస్సు టాప్ లేచిపోయింది.. ఎలాగో మీరే చూడండి!