Hydra: గ్రేటర్ పరిధిలోని ట్రై సిటీల్లోని సర్కారు భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా (Hydra) లక్ష్య సాధన దిశగా పని చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కుత్బుల్లాపూర్ మండలంలోని గాజుల రామారంలో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన 300 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా తాజాగా మరో సంచలనాన్ని సృష్టించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్ లో దాదాపు రూ.3600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా శనివారం కాపాడింది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోని సర్వే నంబర్ 59లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉంది. ఆ భూమిని కొంతమంది కబ్జా చేశారు.
హైడ్రా బోర్డులను ఏర్పాటు
ఈ విషయమై హై కోర్టు తీర్పు మేరకు హైడ్రా భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించింది. అందులో తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించారు. ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. కాగా, ఈ భూమి కబ్జా వెనకా ఓ ప్రతినిధి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా ఏర్పడిన గత సంవత్సరం జూలై మాసం నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.60 వేల కోట్ల నుంచి రూ. 65 వేల కోట్ల విలువైన భూములను కాపాడినట్లు అంచనాలున్నాయి.
Also Read: Mahabubabad District: మానుకోట ఎన్నికల్లో కొత్త గుర్తు?.. రెండు రోజుల్లో వెలుగులోకి వచ్చే అవకాశం
ఫిర్యాదులు, సమస్యలపై 92400 21456ను సంప్రదించండి..రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ కాల్ సెంటర్ ను శనివారం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు, వారి ఫిర్యాదులు, సందేహాలను నివృత్తి చేసేందుకు కాల్ సెంటర్ నంబర్ 92400 21456ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, ఇతర అంశాలపై ఈ నంబర్‌కు తెలియజేయవచ్చు అని పేర్కొంది.
ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు
‘పౌరులకు, అధికారులకు మధ్య కమ్యూనికేషన్ జరిగేలా ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొనడంతోపాటు తమ సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకురావడానికి కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళి, ఓటింగ్ వివరాలు, అభ్యర్థుల సమాచారం తదితర వివరాలను ప్రజలు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని పేర్కొంది.
Also Read: OG Movie: ‘ఓజీ’ మూవీ నేహా శెట్టి సాంగ్ వచ్చేసింది.. ఈ పాటను ఎలా మిస్ చేశారయ్యా?
