Neha Shetty in OG
ఎంటర్‌టైన్మెంట్

OG Movie: ‘ఓజీ’ మూవీ నేహా శెట్టి సాంగ్ వచ్చేసింది.. ఈ పాటను ఎలా మిస్ చేశారయ్యా?

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ‘ఓజీ’గా థియేటర్లలో అగ్ని తుఫానును సృష్టించి, చాలా గ్యాప్ తర్వాత బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సుజీత్ (Sujeeth).. తన అభిమాన హీరోని ఎలా చూడాలని అనుకుంటున్నాడో.. అలా చూపించి, ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు. సినిమా చూసిన వారంతా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ఈ సినిమా దూసుకెళుతోంది. ‘ఓజాస్ గంభీర’గా పవన్ కళ్యాణ్ అభినయానికి, శ్వాగ్‌కి.. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman S) ఇచ్చిన ఆర్ఆర్, పాటలు.. సుజీత్ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాటిక్ తుఫానుగా ఈ సినిమాను మలిచిన తీరు.. అభిమానులకే కాకుండా, ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 300 కోట్ల దిశగా దూసుకెళుతోంది. తాజాగా ఈ మూవీలో యాడ్ చేసిన సాంగ్‌కు సంబంధించిన లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Rahul Ramakrishna: నేనొక చిన్న నటుడ్ని.. నా బాధ్యత తెలుసుకున్నా.. ట్విట్టర్‌కు గుడ్ బై!

‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ వచ్చేసింది

హాట్ బ్యూటీ నేహా శెట్టి ఈ స్పెషల్ సాంగ్‌ చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది. చివరి నిమిషంలో జరిగిన హడావుడితో.. సినిమాలో ఈ సాంగ్ లేకుండానే మేకర్స్ విడుదల చేశారు. నిడివి, ఫ్లో మిస్ కాకుండా ఉండేందుకు పక్కన పెట్టారని అంతా అనుకున్నారు. ఈ విషయంలో నేహా శెట్టి (Neha Shetty) బ్యాడ్ లక్‌‌పై ఓ రేంజ్‌లో చర్చలు కూడా జరిగాయి. మరి ఏం అనుకున్నారో, ఏమోగానీ.. విడుదలైన 5 రోజులకే ఈ పాటను మేకర్స్ సినిమాలో యాడ్ చేశారు. ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ (Kiss Kiss Bang Bang) అంటూ సాగిన ఈ పాటను యాడ్ చేయడంతో.. మరోసారి ఈ సినిమాను చూసేందుకు కుర్రాళ్లు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ పాట లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేయడంతో.. ఈ సాంగ్ చూసిన వారంతా, ఈ పాటను ఎలా మిస్ చేశారయ్యా? లేలేత అందాలతో నేహా శెట్టి కట్టి పడేస్తుంటే.. అలా ఎలా పక్కన పెట్టేయాలని అనిపించింది? అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!

నేహా శెట్టి ఫైర్ పుట్టిస్తోంది

మరికొందరు ఈ పాట లేకపోయినా సినిమా బాగానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఒక్కటి చాలు.. టికెట్ డబ్బులకు సరిపడా ఎంటర్‌టైన్‌ అవడానికి.. అంటూ కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం విశేషం. ఇక ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి తనయుడు శ్రీజో లిరిక్స్ అందించగా.. సోహ, వాగ్ధేవి, మధుబంతి బాగ్చి ఆలపించారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమాలో చూడని వారంతా ఈ పాటను చూసేందుకు ఎగబడుతుండటంతో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ‘డీజే టిల్లు’ రాధిక అదే నేహా శెట్టి తన అందచందాలతో ఫైర్ పుట్టించేస్తోంది. మరెందుకు ఆలస్యం.. పాటను చూసేయండిక. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?