Mahabubabad District: మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త గుర్తును ఓటర్లు చూసే అవకాశం ఉంది..? ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో పూర్తి వివరాలతో గుర్తుపై సమావేశం ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత పార్టీల పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో కొంతమంది సమర్థులు, నీతిపరులు, ప్రశ్నించే గొంతుకలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వాణి వినిపించి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. ఇప్పుడున్న పార్టీల లో కొంతమందికి మొండి చేయి చూపిస్తే కొత్త గుర్తు పై పోటీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా సంసిద్ధులు అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసే వారి స్థానాల్లో ఇప్పుడు వచ్చే కొత్త గుర్తు పై పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి.
వేరువేరు గుర్తులు కాకుండా ఒకే గుర్తుపై…
ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న వారంతా కొత్త గుర్తును ఆశ్రయించే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఇండిపెండెంట్(Independent) అభ్యర్థులకు ఒకే గుర్తుపై పోటీ చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం కొత్త గుర్తు జాతీయ పార్టీకి సంబంధించినదిగా తెలుస్తోంది. ఇదంతా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త గుర్తుతో కొత్త పార్టీ వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ గుర్తుపై దాదాపు ఎవరూ కూడా పోటీ చేసిన సందర్భాలు కనిపించలేదు. అయితే ఈ గుర్తు పొందిన పార్టీ అభ్యర్థులు మాత్రం కొన్నిచోట్ల తక్కువచోట్ల పోటీ చేసిన దాఖలాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త గుర్తు పార్టీ వ్యవస్థాపకులు గతంలో ఎమ్మెల్సీ(MLC)గా పనిచేసినట్లుగా తెలుస్తోంది.
Also Read: IOB Good News: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అదిరిపోయే గుడ్‌న్యూస్
పార్టీల వ్యతిరేకులు కొత్త గుర్తుపై ఆసక్తి
అధికార కాంగ్రెస్(Congress) పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి(BJP) పార్టీ, తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న టిఆర్ఎస్(TRS) పార్టీ, తెలుగుదేశం(TDP) పార్టీ, సిపిఐ(CPI), సిపిఎం(CPM), వామపక్ష పార్టీలు ఇప్పటికే తమ గుర్తులపై అభ్యర్థులు పోటీ చేశారు. ఇక తెలంగాణలో మాయా ట్రెండ్ నడిచే అవకాశం కొత్తగా కనిపిస్తోంది. ఇందుకు డోర్నకల్ నియోజకవర్గ ఓ పార్టీ నాయకుడు కొత్త గుర్తుపై ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేయించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
Also Read: Conflicts in Maoists: మావోయిస్టు పార్టీలో విభేదాలు.. చివరికి ఏం జరుగుతుందో?
