Hydra: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై సిటీల్లోని సర్కారు ఆస్తులైన చెరువులు,కుంటలు, నాలాలను పరిరక్షిస్తున్న హైడ్రా (Hydra) ఇపుడు మూసీ ఆక్రమణలపై ఫోకస్ చేసింది. గతంలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించి, అమ్ముకున్న నిర్మాణాలు విషయాన్ని పక్కన బెడితే తాజాగా మూసీని ఆక్రమించి నిర్మిస్తున్న కట్టడాలపై ఫోకస్ చేసింది. మూసీని ఆక్రమించి శ్రీ ఆదిత్య సంస్థ చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్డు స్థల సేకరణలో భూమి కొల్పోయిన శ్రీ ఆదిత్య, ఆ మొత్తం భూమిని మూసీని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు హైడ్రా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: Hydra Commissioner: అమీర్‌పేట ముంపునకు హైడ్రా పరిష్కారం.. పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్!
నోటీసులు జారీ చేసేందుకు హైడ్రా రంగం సిద్దం
కేవలం రెండు ఎకరాల భూమి ఉండగా, మూసీని ఆక్రమించి ఆరు ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టినట్లు టెక్నికల్ గా గుర్తించే పనిలో హైడ్రా నిమగ్నమైనట్లు తెలిసింది. శాటిలైట్ ఫొటోల ఆధారంగా మూసీని శ్రీ ఆధిత్య ఆక్రమిత స్థలాన్ని గుర్తించి, త్వరలోనే శ్రీ ఆదిత్యకు నోటీసులు జారీ చేసేందుకు హైడ్రా రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. శ్రీ ఆధిత్య మూసీ ఆక్రమణకు సంబంధించి హైడ్రాపై రాజకీయంగా చాలా వత్తిళ్లున్నట్లు తెలిసింది. అయినా వాటన్నింటికీ టెక్నికల్ సాక్షాలతో చెక్ పెడుతూ నోటీసులు జారీ చేసేందుకు
మూడేళ్ల క్రితమే హెచ్ఎండీఏ షోకాజు నోటీసు
2022లోనే ఆదిత్య కేడియా రియాల్టర్స్ కంపెనీకి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవుల గ్రామంలో 9.19 ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్ఎండిఏ అనుమతులిచ్చింది. మూసీ నది బఫర్ జోన్ ను ఆక్రమించి అక్కడ రిటైనింగ్ వాల్ ను నిర్మించినట్లు 2023 జూలై 3న హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీల్లో గుర్తించారు. 2 ఆగస్టు 2023న ఆ సంస్థకు హెచ్ఎండిఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో 18 ఆగస్టు 2023న భవన నిర్మాణ అనుమతులను హెచ్ఎండీఏ రద్దు చేసింది.
ఆదిత్య సంస్థ హైకోర్టుకు
అప్పటి ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి ఆదేశాల మేరకు అనుమతులు రద్దు చేసినట్టు అధికారవర్గాల్లో చర్చ లేకపోలేదు. అనుమతులను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య సంస్థ హైకోర్టుకు వెళ్లింది. మరోసారి జాయింట్ ఇన్స్ పెక్షన్ చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను అనుసరించి 26 ఫిబ్రవరి 2024న అధికారులు చేపట్టిన జాయింట్ ఇన్స్ పెక్షన్ లో ఆ సంస్థ రిటైనింగ్ వాల్ ను తొలగించినట్లు తేలింది. అనుమతులను పునరుద్ధరించాలని 1 మార్చి 2024న హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 20 జూన్ 2024న అన1, 476/ ఏఏ2 లోని 9.19 ఎకరాల విస్తీర్ణంలో 38 అంతస్తుల బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ 12 మే 2022న హెచ్ఎండీఏ కార్యాలయానికి ఆదిత్య సంస్థ దరఖాస్తు చేసింది.
నిర్మాణం చేపట్టదల్చిన భూమికి సమీపంలో మూసీ నది ఉన్నట్లు గుర్తించడంతో సదరు సంస్థను హెచ్ఎండీఏ క్లారిటీ కోరింది. 8 అక్టోబరు 2021న ఇరిగేషన్ శాఖ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీచేసిన ఎన్ఓసీలను హెచ్ఎండీఏ కు ఆదిత్య సంస్థ సమర్పించగా, ప్రతిపాదనలను మల్టీ స్టోర్డ్ బిల్డింగ్(ఎంఎస్బీ) కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత భవన నిర్మాణ అనుమతులను ఇవ్వడానికి నిర్దేశిత ఫీజు చెల్లించాలని ఆ సంస్థకు సూచించింది. నిర్ణీత ఫీజు చెల్లించిన తర్వాతే 19 ఆగస్టు 2022న భవన నిర్మాణ అనుమతులను జారీ చేసినట్లు సమాచారం.
Also Read: Hydra: బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల.. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
