HYDRA Commissioner: వర్షాకాలం ముందుగానే ప్రారంభమైందని, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చిన్న పాటి వర్షాలకే వరద ముంచెత్తుతోందని, నాలాల్లోని నీరు ఎలాంటి అడ్డంకుల్లేకుండా ప్రవహించాలని, అందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ ఎవీ రంగానాథ్ అధికారులను ఆదేశించారు. తేలిక పాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే, కుండ పోత వర్షాలకు నానా అవస్థలు పడాల్సి ఉంటుందది కూడా కమిషనర్ హెచ్చరించారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఏం చేద్దాం అని కూడా హైడ్రా కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖలలో నాలాల విభాగానికి చెందిన ఇంజినీరింగ్ అధికారులతో హైడ్రా కార్యాలయంలో శనివారం చర్చించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Damodar Rajanarsimha: స్టైఫండ్ సమస్య సృష్టిస్తున్న.. కాలేజీలపై యాక్షన్ తీసుకోవాలి!
సమస్య ఉంటే…
నాలాల సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నాలాల ఆక్రమణలో నివాసాలుంటే పరిష్కార మార్గాలు చూద్దామని, ఇతర కట్టడాలుంటే తొలగించాల్సినవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో మీకేమైనా ఇబ్బందులుంటే నేరుగా సమాచారం, ఇస్తే తాము చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాంతాలవారీ నాలాల సమస్యలను గుర్తించాలి. మీరంతా స్పష్టమైన అవగాహనతో ఉంటే సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చెరువుల పునరుద్ధరణతో పాటు నాలాల పరిరక్షణకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తోందని, ఈ క్రమంలోనే కబ్జాల నివారణపై హైడ్రా దృష్టి పెట్టిందని చెప్పారు. నాలాలు కుదించుకుపోవడం, మధ్యలో ఆటంకాలు ఏర్పడినా, ఆక్రమణలకు పాల్పడినా ఆ వివరాలివ్వాలని కోరారు. ఇందుకు సంబంధించిన నివేదిక రూపొందించాలని సూచించారు.
చెత్త పేరుకుపోకుండా..
కల్వర్టుల వద్ద చెత్త పేరుకుపోతోందని, ఆ చెత్తను తొలగించడంలో నిర్లక్ష్యమే వరద ముప్పునకు ప్రధాన కారణమవుతుందని కమిషనర్ అభిప్రాయపడ్డారు. మలక్‌పేట వద్ద మ్యాన్ హోళ్ల నుంచి వరద పోటెత్తడానికి ఇదే కారణమన్నారు. చెత్త తొలగించే పనులు సాఫీగా సాగుతున్నాయా? లేదా? అనేది ఎప్పటికపుడు పర్యవేక్షించాలని సూచించారు. నాలాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలాల్లో, వరద నీటి కాలువల్లో చెత్త వేసే వారికి సమాచారమిస్తేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైడ్రా పోలీసు స్టేషన్‌లో వారిపై కేసులు పెట్టి విచారిస్తామన్నారు. ఈ ఏడాది నగరానికి వరద ముప్పు లేకుండా అందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని ఆయన సూచించారు.
Also Read: Swetcha Effect: నకిలీ విత్తనాల దందాపై.. స్పందించిన ప్రభుత్వం!