Damodar Rajanarsimha(image credit: swetcha reporter)
తెలంగాణ

Damodar Rajanarsimha: స్టైఫండ్ సమస్య సృష్టిస్తున్న.. కాలేజీలపై యాక్షన్ తీసుకోవాలి!

Damodar Rajanarsimha: రాష్ట్రంలో పీజీ సీట్లను పెంచాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఎన్ ఎంసీ ని కోరారు. ఈ మేరకు శనివారం ఎన్ ఎంసీ చైర్మన్ డాక్టర్ బీఎన్ గంగాధర్ తో బేగంపేట్ టూరిజం ప్లాజాలో హెల్త్ మినిస్టర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్ల స్టైఫండ్ సమస్యను నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ దృష్టికి హెల్త్ మినిస్టర్ తీసుకువెళ్లారు.

స్టైఫండ్ విషయంలో స్టూడెంట్స్‌ను ఇబ్బంది పెడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. స్టూడెంట్స్ అందజేసిన రిప్రజంటేషన్ కాపీని మంత్రి చైర్మన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఒకేసారి భారీ సంఖ్యలో కాలేజీలు పెరిగినందున, ఫాకల్టీ సర్దుబాటు, బిల్డింగుల విషయంలో అవసరమైన మినహాయింపులు ఇవ్వాలని మంత్రి కోరారు. ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు లేకపోవడం వల్ల, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

Also ReadSwetcha Effect: నకిలీ విత్తనాల దందాపై.. స్పందించిన ప్రభుత్వం!

పీజీ సీట్లు పెరిగితే, ప్రజలకు మేలు జరుగుతుందని మెరుగైన వైద్య సేవలు అందుతాయని, మెడికల్ కాలేజీల్లో ఫాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు కూడా ఇబ్బంది ఉండదని ఎన్‌ఎంసీ చైర్మన్‌కు మంత్రి వివరించారు. మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీ చైర్మన్‌ను మంత్రి కోరారు. సమావేశంలో పాల్గొన్న హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఎన్‌ఎంసీ మాజీ సభ్యుడు, ప్రముఖ డాక్టర్ సూర్యనారాయణ రాజు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి, డీఎంఈ (అడ్మిన్) శివరామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ఆహ్వానం మేరకు ఉస్మానియాలో స్టూడెంట్స్, టీచింగ్ ఫాకల్టీతో ఎన్ ఎంసీ చైర్మన్ సమావేశమయ్యారు. ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో సీటు రావడం ఇక్కడి విద్యార్థులకు దక్కిన అదృష్టం అని వ్యాఖ్యానించారు. విద్యార్థి దశలో ఎంత ఎక్కువ మంది పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించగలిగితే, అంత ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చునని ఎన్ ఎంసీ చైర్మన్ సూచించారు. ఎక్కువ పనిచేస్తున్నామన్న భావనను వీడాలని, శక్తి మేరకు కష్టపడి ఉత్తమ వైద్యులుగా ఎదగాలన్న డాక్టర్ గంగాధర్ కోరారు.మెడికోలకు, ఫాకల్టీకి అన్నివిధాల అండగా ఉంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. అదే సమయంలో మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచేందుకు సహకరించాలని ఫాకల్టీకి విజ్ఞప్తి చేశారు .

Also Read: Rangareddy Medchal: ఎఫ్‌టీఎల్‌ ఎందాకా?.. ఈ జిల్లాల్లోనే 60శాతానికి పైగా చెరువుల్లో ఆక్రమణలు!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?