Water Supply: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు మెయిన్ పైప్‌లైన్‌లో తలెత్తిన భారీ లీకేజీల అరికట్టడానికి జలమండలి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టింది. పెద్దపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేజ్-3 పైప్‌లైన్ మరమ్మతులతో పాటు, టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132 కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఈ కారణంగా ఈ నెల 3వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు 4వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు (మొత్తం 18 గంటలు) నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.
Also Read: The Black Gold: సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ రిలీజ్‌పై మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఇదే..
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
జలమండలి ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ డివిజన్ 15లోని మలేషియన్ టౌన్‌షిప్, మాదాపూర్(Madhapur), కొండాపూర్(Kondapur), డోయెన్స్ సెక్షన్, మాదాపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఓ అండ్ ఎం డివిజన్ 9 లోని భరత్ నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీ నగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపీహెచ్‌బీ(KBHB) కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్ కొంత భాగంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఓ అండ్ ఎం డివిజన్ 6 లోని ఫతేనగర్, ఓ అండ్ ఎం డివిజన్ 17 లోని గోపాల్ నగర్, హఫీజ్‌పేట్ సెక్షన్, మయూరి నగర్, మియాపూర్ సెక్షన్, ఓ అండ్ ఎం డివిజన్ 22లోని ప్రగతినగర్ సెక్షన్, మైటాస్, ట్రాన్స్‌మిషన్ డివిజన్ 2లోని బీహెచ్ఈఎల్ ఎంఐజీ-1,2, రైల్ విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయమేర్పడుతుందన్న విషయాన్ని గుర్తించి, వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది.
Also Read: Gali Janardhan Reddy: గాలి జనార్థన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి, 25 మందికి గాయాలు

