GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: హైదరాబాద్‌లో ప్యాండమిక్ కంట్రోల్ ల్యాబ్.. ఏర్పాటు దిశగా అడుగులు

GHMC: గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్యాండమిక్ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటుకు చక చక అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా కొత్తకొత్తగా వస్తున్న వైరస్, వ్యాధులపై పరిశోధన చేయటంతో పాటు వాటర్, ఏయిర్, ఫుడ్ కలుషితం జరిగినపుడు ఎక్కడ లోపం జరిగిందన్న విషయాన్ని తెల్సుకునేందుకు ఈ ల్యాబ్ కీలకంగా పని చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వైరల్ వ్యాధులు(Viral diseases) ప్రబలినపుడు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? వ్యాధి మూలాలు ఏమిటీ? ఇతరులకు వ్యాపించే సామర్థ్యం ఎంత ఉందన్న విషయాన్ని కూడా ఈ ల్యాబ్ ముందుగానే అంచనా వేసి, ప్రజారోగ్య పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టేలా అత్యాధునిక యంత్రాలను ఈ ల్యాబ్ లో సమకూర్చనున్నట్లు సమాచారం. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్నిమహానగరాల్లో ఏర్పాటు చేస్తున్న మెట్రో సర్వైలెన్స్ యూనిట్ లలో భాగంగా హైదరాబాద్(Hyderabad) నగరంలో కూడా ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మొత్తం 17 విభాగాల సేవలు

ఈ ల్యాబ్ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ(GHMC) నారాయణగూడలోని ఐపీఎం(IPM) ఆవరణను సిఫార్సు చేయగా, అందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ల్యాబ్ ఏర్పాటు అయ్యే వ్యయంలో తొలి దశగా 25 శాతంగా రూ. 81 లక్షల 35 వేలను ఇప్పటికే జీహెచ్ఎంసీ(GHMC) ఖాతాకు బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పబ్లిక్ హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ తో పాటు మొత్తం 17 విభాగాల సేవలను అందించేలా ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నారు. అయితే జీహెచ్ఎంసీ సిఫార్సు చేసిన నారాయణగూడలోని ఐపీఎం స్థలం కేవలం ల్యాబ్ ఏర్పాటుకు సరిపోతుందని, ఈ ల్యాబ్ పరిపాలన విభాగం కోసం మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కోరగా, జీహెచ్ఎంసీ తన సొంత ప్రాపర్టీ అయిన హరిహరకళాభవన్ ను సిఫార్సు చేయగా, అందుకు అంగీకరించిన కేంద్రం ఈ మేరకు నిధులను కూడా మంజూరు చేసినట్లు, వీలైనంత త్వరగా ఈ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. ల్యాబ్ ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, సిబ్బంది జీతభత్యాలను జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాటాలుగా చెల్లించనున్నట్లు సమాచారం.

Also Read: Komatireddy venkat reddy: లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్లు నీతులు చెప్తారా?.. మంత్రి ఫైర్?

రాష్ట్రంలో రెండో ల్యాబ్

ప్రస్తుతం మహానగరంలో కల్తీ, కలుషితమైన ఆహారం, ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ జరిగి జనాలు అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో సేకరించిన ఫుడ్ శ్యాంపిల్స్ తో పాటు వివిధ రకాలుగా వస్తున్న ఫిర్యాదులతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వివిధ దుకాణాలు, ఆహార విక్రయ కేంద్రాల నుంచి సేకరించిన ఫుడ్ శ్యాంపిల్స్ ను సేకరించి ప్రస్తుతం నాచారంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్)కు తెలుగు రాష్ట్రాల నుంచి శ్యాంపిల్స్ వస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే ల్యాబ్ ఉండటంతో ఈ ల్యాబ్ కు వచ్చిన శ్యాంపిల్స్ ను పరీక్షించి, రిపోర్టులు వచ్చేందుకు నెలల వ్యవధి పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నారాయణగూడలో కొత్త ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం హైదరాబాద్ మహానగరంలోని ఫుడ్ శ్యాంపిల్స్, సీజనల్ గా వచ్చే వైరస్ లు, వ్యాధులపై పరీక్షలు చేసి, ప్రజారోగ్య పరిరక్షణకు పలు సిఫార్సులు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నారాయణగూడలోని ఐపీఎంలో ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో రెండో ల్యాబ్ గా అందుబాటులోకి రానుంది.

పోస్టులన్నీ ఔట్ సోర్సే

ఈ ల్యాబ్ లో విధులు నిర్వహించే టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టాఫ్ గా మొత్తం 28 మందిని నియమించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్ తో పాటు ఇతర కెటగిరీలు సిబ్బంది మొత్తం 28 మంది ఉన్నట్లు, వీరందర్నీ ఔట్ సోర్స్ ప్రాతిపదికనే నియమించనున్నట్లు వెల్లడించారు. నియామకానికి సంబంధించి త్వరలోనే ఓ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియను పరిశీలించేందుకు నియామక కమిటీ చైర్మన్ గా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, వైస్ చైర్మన్ గా హెల్త్ విభాగం డైరెక్టర్ ను నియమించనున్నట్లు తెలిసింది.

Also Read: Tummala Nageswara Rao: పాసుబుక్కులతో యూరియా పంపిణీ: మంత్రి తుమ్మల

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ